20-10-2025 12:00:00 AM
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
రాజాపూర్, అక్టోబర్ 19 : మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని రంగారెడ్డిగూడ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో పెద్ద చెరువు కట్ట మైసమ్మ పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. అనంతరం మాట్లాడుతూ ముదిరాజ్ కుటుంబాలు చేపల చెరువులపై ఆధారపడి , చేపలు పెంచుతూ జీవిస్తున్నాయన్నారు.
మత్రకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లలు ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నదని అన్నారు. మంచి రకాల చేపలను పెంచి లాభాలు పొందాలని సూచించారు. ఈ కార్యాక్రమంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు శివప్రసాద్, డైరెక్టర్ లు శివకుమార్, వెంకటేష్,కృష్ణయ్య, యాదగిరి, రాజు,సంజీవ్, పవన్,నరేష్, సభ్యులు కిరణ్,ప్రవీణ్, ప్రేమ్, లక్ష్మీనారాయణ, రవి,రమేష్, సత్యనారాయణ, రాజేష్, గుణాకర్ తదితరులు పాల్గొన్నారు.