calender_icon.png 16 May, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తా

16-05-2025 01:00:28 AM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి.

హనుమకొండ, మే 15 (విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని ప్రతి కాలనీన్ని అభివృద్ధి చేపడుతానని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం రోజున 10వ డివిజన్‌కాపువాడా పి టి సీ పాఠశాల ఆవరణలో15వ ఆర్థిక సంఘ నిధులు రూ. 25లక్షలతో అంతర్గత రోడ్డు నిర్మాణం కోసం శంకుస్థాపన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ అశ్విని తనాజీ వాకాడే తో కలిసి చేశారు.

ఈ సందర్బంగా కాలానిలో పర్యటించి సమస్యలను పరిశీలించారు. శితిలావస్థలో ఉన్న పాత భవనాన్ని కూల్చి వేయాలని అధికారులకు ఆదేశించారు.  ఈ సందర్బంగా మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రతి (బస్తీ) కాలనీలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని, సైడ్ డ్రైన్, అంతర్గత రోడ్ల నిర్మాణం కోసం ప్రజలు కూడా అధికారులకు సహకరించగలరని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, మాజీ కార్పొరేటర్ నాసిమ్ జాన్,  డివిజన్ అధ్యక్షులు కుమార్ యాదవ్, నాయకులు మామిడిశెట్టి సతీష్, పల్లం రమేష్, బొంత రామకృష్ణ, మంద రాకేష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.