16-05-2025 01:02:07 AM
హుజూర్ నగర్, మే 15: తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ప్రతి కార్య కర్త కృషి చేయాలని తెలుగుదేశం పార్టీ హుజూర్నగర్ సంస్థాగత ఎన్నికల పరిశీలకుడు అమరవరపుశ్రీమన్నారాయణ అన్నారు.గురువారం తెలుగుదేశం పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం పట్టణంలోని వర్తక సంఘం భవనంలో జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయి నుంచి తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. గ్రామాలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ లభిస్తుందని ,కొద్ది రోజుల క్రితం జరిగిన సభ్యత్వ నమోదు ఇందుకు నిదర్శనం అని అన్నారు.
హుజూర్నగర్ నియోజకవర్గంలో ఐదు మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యాయన్నారు అన్నారు.మరో రెండు మండలాలలో పోటీ నెలకొనగా పార్టీ అధిష్టానానికి నివేదిక పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి మండవ వెంకటేశ్వర్లు గౌడ్, బెల్లంకొండ రామజోగి గౌడ్,టిఎన్టియుసి రోషపతి తదితరులు పాల్గొన్నారు.