calender_icon.png 13 July, 2025 | 6:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికశాతం వడ్డీలతో కుంటుపడుతున్న అభివృద్ధి

13-07-2025 12:56:02 AM

  1. వాటిని చెల్లించేందుకే రాష్ట్ర ఆదాయం ఖర్చు
  2. రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి  
  3. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
  4. సీఎంతో ఆర్థిక సలహామండలి చైర్మన్ మహేంద్ర దేవ్ భేటీ 

హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపైన సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అధిక శాతం వడ్డీల కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని, తిరిగి వాటి చెల్లింపులు చేయడం కష్టమవుతోందని పేర్కొన్నారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ర్ట ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందని, అధిక వడ్డీ రేట్లకు తీసుకున్న రుణాలపైన వడ్డీ తగ్గించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నామని సీఎం తెలిపారు.

జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డిని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్ ఎస్.మహేంద్ర దేవ్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణను అభివృద్ధి పథం లో తీసుకువెళ్లే పలు అంశాలపై చర్చించారు. సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించు కోవాలని సీఎం తెలి పారు.

రాష్ట్రాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. హైదరాబాద్‌తో పాటు రాష్ర్టంలోని పట్టణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సా రించామని వెల్లడించారు. యువతకు ఉపా ధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా తాము ముందుకు సాగుతున్నామని వివరించారు.

రాష్ర్టంలో పారిశ్రామిక రంగంతో పాటు సేవల రంగం అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఉద్యోగులకు సముచితమైన అవకాశాలు కల్పిస్తేనే రాష్టానికి కంపెనీలు వస్తాయన్నారు. హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్(ట్రిపుల్‌ఆర్)ను నిర్మిస్తామని, ట్రిపుల్‌ఆర్‌కు అనుసంధానంగా రేడియల్ రోడ్లు నిర్మిస్తున్నామని చె ప్పారు. సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కా ర్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పాల్గొన్నారు.