calender_icon.png 23 July, 2025 | 8:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతి చెందిన గొర్రెలకు నష్ట పరిహారం అందించేందుకు కృషి

22-07-2025 10:22:18 PM

చిల్లపల్లిలో మృతి చెందిన గొర్రెల పరిశీలనలో మంథని తాసిల్దార్ కుమారస్వామి..

మంథని (విజయక్రాంతి): మృతి చెందిన గొర్రెలకు నష్ట పరిహారం అందించేందుకు కృషి చేస్తామని చిల్లపల్లిలో మృతి చెందిన గొర్రెల పరిశీలనలో మంథని తహసీల్దార్ కుమారస్వామి(Tahsildar Kumaraswamy) అన్నారు. సోమవారం సాయంత్రం గొర్రెల మందపైన పిడుగు పడి 36 గొర్రెలు మృతిచెందగా మంగళవారం తహసీల్దార్ గిరవేన కుమార్ స్వామి, ఆర్ఐ అనిల్ రెడ్డి, పశువుల వైద్య అధికారి రవి కుమార్ గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించి, మృతి చెందిన గొర్రెలకు పంచనామా చేశారు. గొర్రెల కాపరి పోశంకు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని మంథని యాదవ సంఘం మండల అధ్యక్షులు మోహన్ యాదవ్ తహసీల్దార్ ను కోరారు. గొర్రెలకు నష్ట పరిహారం అందించేందుకు జిల్లా కలెక్టర్ కు నివేదిక పంపించి నష్టపోయిన గొర్రెల కాపరిని ప్రభుత్వం నుంచి ఆర్థికంగా ఆదుకుంటామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.