calender_icon.png 23 July, 2025 | 8:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాగా పనిచేసే పోలీసులకు రివార్డ్స్, గుర్తింపు ఉంటుంది

22-07-2025 10:42:07 PM

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ తనిఖీలో రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా..

పెద్దపల్లి (విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమిషనరేట్ లో బాగా పని చేసే పోలీసులకు తప్పకుండా రివార్డ్స్, గుర్తింపు ఉంటుందని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా(CP Amber Kishore Jha) తెలిపారు. మంగళవారం వార్షిక తనిఖీల్లో భాగంగా సీపీ పెద్దపల్లి జోన్ పోత్కపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సీపీ పోలీస్ స్టేషన్ పరిసరాలను, వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను పరిశీలించి కేసుల వివరాలను తెలుసుకొని పోలీస్ స్టేషన్ లోని రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ ప్రాంతంలోని మావోయిస్టుల, వారి కుటుంబ వివరాలు, పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాల్లో ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయని ఆరా తీశారు. 

అనంతరం పోలీస్ స్టేషన్ స్టేషన్ రికార్డ్స్, హిస్టరీ షీట్స్, మండల భౌగోళిక స్థితి, నేరాల నమోదు, కేసుల స్థితిగతులు, కోర్టు క్యాలెండర్, సాంకేతికత మొదలగు వాటిని పరిశీలించారు. గంజాయి రవాణా, వినియోగం నిరోదించేలా బాధ్యతగా పని చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబుల్ పోలీసింగ్, బిట్లు, పెట్రోలింగ్ పగడ్బందీగా నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని సీపీ తెలిపారు. అనంతరం సీపీ స్టేషన్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ తనిఖీల్లో  పెద్దపల్లి ఇంచార్జ్ ఏసీపీ శ్రీనివాస్, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పోత్కపల్లి ఎస్ఐ డి. రమేష్, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్, సిసి హరీష్ ఉన్నారు.