calender_icon.png 11 July, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిమార్గంతోనే అభివృద్ధి సాధ్యం

12-09-2024 02:56:57 AM

జైనూర్ ఘటన నేపథ్యంలో ఆదివాసీలతో ఎస్పీ సమావేశం

ఆదిలాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాంతి): శాంతిమార్గం దారానే అభివృద్ధి సాధ్యమవుతుందని, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువతకు అవగాహన కల్పించాలని ఎస్పీ గౌష్ ఆలం ఆదివాసి పెద్దలకు సూచించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్‌లో జరిగిన ఘటన నేపథ్యంలో ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా దర్బార్‌లో ఆదివాసీ నాయకులతో బుధవారం ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీల సమస్యలపై ప్రభుతానికి నివేదికను సమర్పిస్తామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో పుకార్లను, సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని కోరారు. పోలీసులకు విచారించే సమయాన్ని ఇస్తే దోషులకు శిక్షపడేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.