calender_icon.png 5 December, 2025 | 1:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులతోనే అభివృద్ధి సాధ్యం

05-12-2025 12:30:02 AM

డీసీసీ అధ్యక్షురాలు ఉమ, ఎమ్మెల్యే మురళి నాయక్ 

మహబూబాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా, వార్డు సభ్యులుగా గెలిపిస్తే గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు డాక్టర్ ఉమ, ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

గత పదేండ్ల బిఆర్‌ఎస్ పాలనలో ఒక్క గ్రామం కూడా అభివృద్ధికి నోచుకొలేదని, పేదల కోసం ఆలోచించే పార్టీ దేశం,రాష్ట్రంలో ఉంది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యం, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్, భూ భారతి, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు,ఇలా ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.