05-12-2025 12:28:47 AM
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి
హనుమకొండ టౌన్, డిసెంబర్ 4 (విజయక్రాంతి):హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో ఒకేషనల్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు బ్యూటీ, వెల్నెస్, మీడియా ఎంటర్టైన్మెంట్ విభాగంలో ఇంటర్నెట్ షిప్ పూర్తిచేసిన విద్యార్థినీ, విద్యార్థులకు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రతిభాపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ వృత్తివిద్యా కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యతో పాటు ఈ కోర్సు పూర్తిచేసిన వారికి ప్రభుత్వం కూడా తగిన ప్రాధాన్యత క ల్పించాలని, విద్యార్థులు విద్యతోపాటు మారుతున్న కాలానుగుణంగా తమను తాము అభివృద్ధి చేసుకుంటూ సామాజిక అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ శ్రీకాంత్, ఏఎంఓ మదన్మోహన్, ఒకేషనల్ టీచర్స్ శివకుమార్, కృష్ణవేణి, పిఆర్టియు జిల్లా మండల బాధ్యులు, ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ, విద్యార్థులు పాల్గొన్నారు.