calender_icon.png 30 August, 2025 | 4:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమగ్ర ప్రణాళికతో గిరిజన గ్రామాలు అభివృద్ధి

30-08-2025 12:14:34 AM

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్

జగిత్యాల అర్బన్, ఆగస్టు 29(విజయ క్రాంతి): జగిత్యాల జిల్లాలోని గిరిజన గ్రామాల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికతో ముందుకు పోవాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ లో శుక్రవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖ సెక్రెటరీ అలగు వర్షిని తో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

అంతకుముందు జగిత్యాల జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పనకు జిల్లా గిరిజన అభివృద్ధి శాఖ ఆధ్వర్యములో జిల్లాలోని గిరిజన గ్రామ పంచాయతీల అభివృద్ది, మౌళిక సదుపాయాల కల్పనకు జిల్లాలోని వివిధ సంబంధిత శాఖల అధికారులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో అలుగు వర్షిని సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా, మండలాల వారిగా విద్యా, వైద్యం, విద్యుత్, రోడ్లు, మంచినీటి వసతి, డ్రైనేజ్, తదితర అంశాల వారిగా ఉన్న వసతులు, వాటి స్థితిపై అధికారులు సమర్పించిన నివేదికలకు పరిశీలించారు.

అలాగే గిరిజన గ్రామ పంచాయతీ లోని ప్రతి తండాకు అనుసందానం లేని రోడ్లు, సిసి రోడ్లు నిర్మాణము,పాఠశాలలలో తరగతి గదులు, వంట గది, టాయ్ లెట్స్ నిర్మాణము, అంగన్ వాడి కేంద్రాల భవన నిర్మాణము, కమ్యూనిటి భవనములు, మహిళాశక్తి భవనములు, విద్యుత్, వీది దీపాల సదుపాయములు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఏర్పాటు, పశువైద్య శాలల నిర్మాణము, లైబ్రరీలు, బస్ షెల్టర్స్ ఏర్పాటు మొదలైన అన్ని రకాల మౌళిక వసతుల నిర్మాణము కొరకు కావలసిన నిధులు రూ. 81.00 కోట్లు అంచనాలను సమీక్షించి, అంశాల వారిగా వాటికి కావలిసిన నిధులను మంజూరి చేయడం జరుగుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.ఇంకా మెరుగైన సదుపాయాల కోసం కావలసిన ప్రణాళికలను తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అడిషనల్ కలెక్టర్ బి ఎస్ లత తదితరులుపాల్గొన్నారు.