calender_icon.png 30 August, 2025 | 2:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

54 అడుగుల ఎత్తైన గణనాధునికి జిల్లా ఎస్పీ ప్రత్యేక పూజలు

30-08-2025 12:14:09 AM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలోనే ఎత్తైన వినాయక విగ్రహాల్లో  ఒకటైన ఆదిలాబాద్ పట్టణంలోని కుమార్ జనతా మండలి ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన 54 అడుగుల ఎత్తైన గణనాధుని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ దర్శించుకున్నారు. వినాయక మండపానికి వచ్చిన ఎస్పీకి మండప నిర్వాకులు మేళాతాళాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మహాగణపతికి వేద పండితుల  మంత్రోచ్ఛరణల నడుమ  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గణపతి విగ్రహ ప్రతిష్ట చరిత్రపై సభ్యులను ఎస్పీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు జిల్లా ఎస్పీకి శాలువాతో సత్కరించడం జరిగింది. అటు భారీ వినాయకుని తయారు చేసిన కళాకారుడు ఊరే గణేష్ ను ఎస్పీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి జీవన్ రెడ్డి, వన్ టౌన్  సీఐ సునీల్ కుమార్, మండప నిర్వాకులు తోట పరమేశ్వర్ తో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు.