calender_icon.png 11 December, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యం..

10-12-2025 12:27:10 AM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్ 9: గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం మండలంలోని జాజిరెడ్డిగూడెం, పర్సాయిపల్లి, అర్వపల్లి, కాసర్లపహాడ్, అడివెంల, తిమ్మాపురం తదితర గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సర్పంచులుగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపే విధంగా చూడాలని ఓటర్లను కోరారు.

ప్రతిపక్ష నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ డీసీసీబీ చైర్మన్ బీరవోలు సోమిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సామా అభిషేక్ రెడ్డి, ఇందుర్తి వెంకటరెడ్డి, గుడిపెల్లి మధుకర్ రెడ్డి, విక్రంరెడ్డి, కొర్రపిడిత అవిలయ్య,

జీడి వీరస్వామి, పాలెల్లి సురేష్, ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు దాసరి సోమయ్య, బానోతు దూల్యా, చిల్లంచర్ల విద్యాసాగర్, మంచాల కళమ్మ, శతకోటి విద్యాసాగర్, జీడి సైదమ్మ, నాయకులు గుడిపెల్లి వెంకట్ రెడ్డి, భైరబోయిన మహారాజు, ఎడ్ల సైదులు, పిట్టల జాని, ఎల్లెంల అవిలయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.