calender_icon.png 29 November, 2025 | 1:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి

29-11-2025 12:52:51 AM

  1. బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుందాం

ఎమ్మెల్యే పాయల్ శంకర్ 

ఆదిలాబాద్, నవంబర్ 28 (విజయక్రాం తి): గ్రామాల్లో జరిగి ఏ అభివృద్ధి పనులైన కేంద్రానికి సంబంధించిన నిధులతోనే చేపట్టడం జరుగుతుందని, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాభివృద్ధికి రూ.25లక్షలను తీసుకొ చ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గం లోని జైనథ్, బేల, బోరజ్ మండలాల్లో వేరువేరుగా పార్టీ శ్రేణులతో కలిసి శుక్రవారం ఏర్పా టు చేసిన సన్నాహక సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.

ఈసందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభు త్వం నిధులు కేటాయించడం లేదన్నారు. గత ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తనను నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాలని, ఇప్పు డు బీజేపీ బలపరిచిన అభ్యర్థులను సైతం నిండు మనసుతో ఆశీర్వదించి, గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం ప్రభుత్వ పథకం ఉపాధి హామీ పథకం తో సిసి రోడ్లు, మురికి కాలువలు, స్మశాన వాటికలు, కమ్యూనిటీహాల్‌లు నిర్మాణం చేపట్టడం జరుగుతుం దన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.