calender_icon.png 29 November, 2025 | 1:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం

29-11-2025 01:22:22 AM

-ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యంగా ఇందిరమ్మ క్యాంటీన్లు

-బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్, కవాడి గూడలో ఇందిరమ్మ క్యాంటీన్ ల ప్రారంభోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్

-హాజరైన ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి

ముషీరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజల సంక్షేమానికి  ప్రజాప్రభుత్వం ప్రాధా న్యం ఇస్తుందని జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జీహెచ్‌ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ , డిప్యూటి మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిలతో బాగ్ లింగంపల్లి సుందరయ్య పార్క్, కవాడిగూడలలో శుక్రవారం ఇందిరమ్మ  క్యాంటీన్లను జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

అనంతరం మంత్రి, మేయర్, ఎంపీ, ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్, జీహెచ్‌ఎంసీ అధికారులు లబ్ధిదారులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శం మేరకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సారధ్యంలో జీహెచ్‌ఎంసీ సౌజ న్యంతో ఆకలి బాధలు లేని హైదరాబాద్ లక్ష్యం గా ఉక్కు మహిళ ఇందిరమ్మ పేరుతో ఇందిరమ్మ క్యాంటీన్ లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఇందిరమ్మ క్యాంటీన్‌ల ద్వారా రూ.5కే  ఉదయం నాణ్యమైన అల్పాహారం రూ.5కే మధ్యాహ్న భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ క్యాంటీన్‌లతో  హైదరాబాద్‌లో ఉపాధి కోసం, పనుల కోసం వచ్చే ప్రజలు, పేదలు, కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, అల్పదాయ వర్గాల వారికి ప్రయోజనం కలుగుతుందని మంత్రి చెప్పారు. ఇంకా నగరంలో ఎక్కడెక్కడ ఇందిరమ్మ క్యాంటీన్లు అవసరముం టాయో ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. త్వరలో పూర్తిస్థాయిలో హైదరా బాద్‌లో ఏర్పాటు చేస్తామన్నారు.

స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరిన చోట కూడా ఇందిరమ్మ క్యాం టీన్‌లు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్‌రెడ్డి మాట్లాడుతూ పేదలకు, అల్పాదాయ వర్గాలకు ఇందిరమ్మ క్యాంటీన్ లు ఎంతో ప్రయోజనకారంగా ఉంటాయన్నారు. ఇప్పటికే ప్రారంభించిన ఇందిరమ్మ క్యాంటీన్ లకు ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తుందన్నారు. హరేకృష్ణ మూవ్మెంట్ చారిట బుల్ పౌండేషన్ వీటి నిర్వహణ బాధ్యతలు చూస్తుందన్నారు.

ఇందిరమ్మ క్యాం టీన్‌ల ద్వారా ఉదయం అందించే అల్పాహారం, మధ్యాహ్న భోజనంతో హైదరా బాద్‌లో పేదలు, అడ్డా కూలీలు, ఆటో డ్రైవర్లు, చిరు వ్యాపారులు, అల్పదాయ వర్గాల వారు, నిరుద్యోగులకు, మహానగరానికి  ఉపాధి కోసం, ఇతరత్ర పనుల కోసం వచ్చే ప్రజలకు ప్రయోజనం కలగనుందన్నారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, స్థానిక కార్పొరేటర్‌లు తదితరులు పాల్గొన్నారు.