18-09-2025 12:00:00 AM
-ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పథకాల అమలు
-రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీ
ఆదిలాబాద్, సెప్టెంబర్ 17(విజయక్రాం తి): ప్రజాపాలన ప్రభుత్వ హయంలోనే రాష్ట్రం అభివృద్ధి దిశ వైపు పయనిస్తోందని, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పలు పథకాలను అమలు చేస్తూ సమర్ధవంతమైన పాలన అందిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు లు, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్ అలీ అన్నారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.
తెలం గాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఎంపీ గోడం నగేష్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహజాన్ తదితరులతో కలిసి ముం దుగా అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం మువ్వన్నల జెండాను ఆవిష్కరించి, జాతీయ గీతాలాపన చేశారు. అనంతరం జిల్లా ప్రజల ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు మహ్మద్ షబ్బిర్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల 60 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత తన నాయకురాలు సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చారని గుర్తు చేశారు.
రాష్ట్రాన్ని పదేళ్ల పాటు పాలించిన బీఆర్‌ఎస్ హయాంలో జరగని అభివృ ద్ధిని కేవలం 21 నెలల తమ ప్రభుత్వ పాలన లో చేసి చూపించామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వ పాఠశాలల బలోపే తం, రేషన్ కార్డుల పంపిణి తదితర పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ మల్లెపూల నర్సయ్య, అదనపు కలెక్టర్ శ్యామలా దేవి, డీఎఫ్‌ఓ ప్రశాంత్ బాజీరావ్ పాటిల్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్ర, ఆర్డీఓ స్రవంతి, జడ్పీ సీఈఓ జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.