calender_icon.png 18 September, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇసుక డంపులను సీజ్

17-09-2025 11:47:58 PM

చిన్న చింతకుంట: మండలంలోని వివిధ గ్రామాల నుంచి ఇందిరమ్మ ఇండ్ల పేరిట అనుమతులు తీసుకొని ఇతర ప్రాంతాలకు అక్రమంగా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇసుక అక్రమార్కులు బుధవారం మండలంలోని మద్దూర్ శివారులో గల సర్వేనెంబర్ 250 వ్యవసాయ భూమిలో గుర్తుతెలియని వ్యక్తులు అక్రమంగా ఇసుకను డంపు చేశారని సమాచారం మేరకు వెళ్లి చూడగా అక్రమంగా ఇసుకను డంపు చేసిన ప్రాంతానికి తహసిల్దారు ఎల్లన్న, ఎస్సై రామ్లాల్ నాయక్ లు వెళ్లి అట్టి ఇసుక డంపును సీజ్ చేసి మద్దూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునే లబ్ధిదారునికి చాలన్ ద్వారా విక్రయించామని అధికారులు తెలిపారు. ఎవరైనా ఇందిరమ్మ ఇండ్ల పేరిట అనుమతులు తీసుకొని అక్రమంగా ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.వీరి వెంట ఆర్ ఐ లు తిరుపతయ్య ,అమీర్ లు ఉన్నారు.