calender_icon.png 1 August, 2025 | 8:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గీతాంజలి విద్యాసంస్థల అధినేతకు డాక్టరేట్

31-07-2025 11:04:04 PM

నర్సంపేట(విజయక్రాంతి): విద్యతో వెలుగు నింపుతూ తమ పాఠశాలలో చదువుతూ తల్లిదండ్రులను కోల్పోయిన పేద, ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు పదవ తరగతి వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్న గీతాంజలి స్కూల్ చైర్మన్ వేములపల్లి సుబ్బారావు కు కేంద్ర ప్రభుత్వ గౌరవ డాక్టరేట్ పురస్కారంను అందుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఎంపిక చేయబడిన అనేక సంస్థల మధ్య గీతాంజలి స్కూల్ ప్రాధాన్యతను సంపాదించి సామాజిక విద్య సేవ విభాగంలో గౌరవ డాక్టరేట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జగదీష్ ముఖిజీ, అస్సాం, నాగాలాండ్ మరియు మిజోరం రాష్ట్రాల మాజీ గవర్నర్. చిరాగ్ పాశ్వాన్ జీ, ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి మీనాక్షి లేఖి జీ, మాజీ విదేశాంగ సహాయ మంత్రి, చందన్ కుమార్ చౌదరి జీ: ఢిల్లీ శాసనసభ సభ్యుడు నుష్రత్ భారుచా భారతీయ బాలీవుడ్ నటి నవాబ్ నజాఫ్ అలీ ఖాన్, హైదరాబాద్‌లోని నిజాం కుటుంబ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెనిజులా, మాల్దీవులు, ఇరాక్, రువాండా, తైమూర్-లెస్టే, బోస్నియా, హెర్జెగోవినా వంటి దేశాల నుండి వివిధ దౌత్యవేత్తలు మరియు రాయబారులు, మంత్రులు విద్యావేత్తల సమక్షంలో డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్నారు.

సామాజిక సేవకు ప్రతీకగా నిలిచిన ఈ పాఠశాల దశాబ్దాలుగా వందలాది మంది పేద విద్యార్థులకు  ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తూ వారికి మెరుగైన భవిష్యత్తు నిర్మించేందుకు కృషి చేస్తోంది. ఈ సందర్భంగా గీతాంజలి స్కూల్ ఛైర్మన్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ ఈ గౌరవం మాకు ప్రోత్సాహం, ఇది మా బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఇంకా ఎక్కువ మంది పేద విద్యార్థులకు చేరువయ్యేలా మా సేవలను విస్తరించబోతున్నాం అని తెలిపారు. స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఈ వార్తను సంతోషంగా స్వాగతించారు. ప్రభుత్వం ఇలా ఉత్తమ విద్యాసంస్థలకు గుర్తింపు ఇవ్వడం, ఇతర సంస్థలకు ప్రేరణగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు.