calender_icon.png 11 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

11-09-2025 12:13:12 AM

కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల/లక్షెట్టిపేట, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో చేపట్టిన ప్రభుత్వ ఆసుపత్రి నిర్మా ణ పనులను, హాజీపూర్ మండలం గుడిపేటలో నిర్మాణమవుతున్న ప్రభుత్వ వైద్య కళా శాల భవన నిర్మాణ పనులను బుధ వారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

వైద్యులు, సిబ్బంది సంఖ్యను పెంపొందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పా టు చేసేందుకు రూ. 216 కోట్లతో నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమాల్లో రోడ్డు భవనాల శాఖ డీఈ సజ్జత్ బాషా, ఈఈ లక్ష్మినారాయణ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనూష, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

పుష్కర ఘాట్లను పరిశీలించిన కలెక్టర్ 

పట్టణ సమీప గోదావరినది తీర పుష్కర ఘాట్లను బుధవారం సాయంత్రం కలెక్టర్ కుమార్ దీపక్ పరిశీలించారు. 2027లో జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన పనులు, కావాల్సిన సౌకర్యాలపై మండల తహసీల్దార్ దిలీప్ కుమార్, మున్సిపల్ కమిషనర్‌లతో ఆరా తీశారు. అనంతరం మంచిర్యాల సమీప గోదావరి నది తీర పుష్కరఘాట్‌ను తహసీల్దార్ రహఫత్‌తో కలిసి పరిశీలించారు. కలెక్టర్ వెంట సంబంధిత శాఖల అధికారులు తదితరులున్నారు.