calender_icon.png 11 September, 2025 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒడిశా నుంచి వచ్చి దొంగతనాలు

11-09-2025 12:14:29 AM

ఏటీఎంలో చోరీకి యత్నించిన నిందితుడు 24 గంటల్లో అరెస్టు: డీఎస్పీ 

ఆదిలాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి):  ఆదిలాబాద్‌లోని ఓ ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగను పోలీసులు 24 గంటల్లోపే పట్టుకున్నారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ జీవన్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌లోని కిసాన్ చౌక్‌లో గల డిబిఎస్ బ్యాంక్ కు సంబంధించిన ఏటీఎం సెంటర్ లో మంగళవారం తెల్లవారుజామున దొంగతనానికి యత్నించిన బిప్లబ్ కుమార్ జెన నిందితు న్ని పట్టుకున్నట్లు డిఎస్పీ తెలిపారు.

నిందితుడు నుండి ఏటీఎం యంత్రాన్ని పగలగొట్టేందుకు ఉపయోగించిన గడ్డపారతో పాటు, ఓ సెల్ఫోన్, ఏటీఎం కార్డును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు ఒడిస్సా రాష్ట్రంకు చెందిన వాడని ఇటీవల నాగ్‌పూర్ మీదుగా ఆదిలాబాద్ కు చేరుకున్నారని తెలిపారు. రైల్వే స్టేషన్ సమీపంలో ఓ భవన నిర్మాణం పనులు జరుగుతున్న చోట నుండి గడ్డపారను దొంగలించి,

మంగళవారం తెల్లవారుజామున ఒంటిగంట 20 నిముషాల సమయంలో చోరీకి యత్నించగా, సైరన్ మోగడంతో నిందితుడు పరారయ్యారని తెలి పారు. బ్యాంకు మేనేజర్ సర్వోత్తమ్ బుద్ధ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని 24 గంటల్లో కేసు ఛేదించమన్నారు. నిందితున్ని పట్టుకున్న పోలీస్ సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారని పేర్కొన్నారు. ఈ మీడియా సమావేశంలో సీఐలు సునీల్ కుమార్, నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.