13-09-2025 03:32:05 AM
కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, సెప్టెంబర్ 12 (విజయక్రాం తి) : జిల్లాలో ఆయా ప్రభుత్వ శాఖల పరిధిలో కొనసాగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీఆర్డీఓ కిషన్, డీపీఓ వెంకటేశ్వర్ రావు, డీడబ్ల్యూఓ రౌఫ్ ఖాన్, డీటీడీఓ జనార్ధన్, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారి రాంమోహన్‌లతో కలిసి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.
స్వచ్ఛభారత్ పథకం కింద వ్యక్తిగత మరుగుదొడ్లు, సామాజిక మరుగుదొడ్లు, మూత్రశా లల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. మున్సిపాలిటీలు, గ్రామపంచా యతీలలో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బంధీగా చేపట్టాలని, గ్రామపంచాయతీ కార్యాలయా లు, అంగన్వాడీ కేంద్రాల భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు.
ప్లాస్టిక్ వేస్ట్ నిర్వాహణకు నిధులు
జిల్లాలో రెండు సింగిల్ యూజ్డ్ వేస్ట్ ప్లా స్టిక్ మేనేజ్‌మెంటు యూనిట్ల ఏర్పాటుకు టెండర్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని, ప్లాస్టిక్ వేస్ట్ నిర్వహణ క్రింద మంజూరైన నిధులను సంక్షేమ, అభివృద్ధి పనులకు నియోగించాలి అని కలెక్టర్ కోరారు.