calender_icon.png 14 September, 2025 | 12:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరిస్టాటిల్ కాలేజీ విద్యార్థుల నిర్డ్ సందర్శన

13-09-2025 03:30:53 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్12 (విజయక్రాంతి): చిలుకూరు  మొయినాబాద్‌లోని అరిస్టాటిల్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులు హైదరాబాద్ రా జేంద్రనగర్లోని నిర్డ్ రూరల్ టెక్నాలజీ పార్క్ ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో 55 మంది ఎంబిఎ సీనియర్ విద్యార్థులు మరి యు తొమ్మిది మంది అధ్యాపకులు పాల్గొన్నారు. గ్రామీణ సాంకేతిక పరిజ్ఞానం, చిన్న తరహా పరిశ్రమల పనితీరు మరియు స్వ యం ఉపాధి అవకాశాలపై అవగాహన పెంపొందించడానికి ఈ పరిశీలనాత్మక పర్యటనను నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. ఎల్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. “మా విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకునే పాఠాలతో పాటు ప్రాక్టికల్ అనుభవం కూడా పొందడం చాలా ముఖ్యం. ఇలాంటి పరిశీలనాత్మక పర్యటనలు విద్యార్థుల్లో పారిశ్రామిక ఆలోచన, నాయకత్వ నైపుణ్యాలు మరియు వృత్తిపరమైన దృక్పథాన్ని పెంపొందిస్తాయి” అన్నారు.