05-05-2025 02:49:16 AM
ఎస్టీపీలన్నీ అందుబాటులోకి తీసుకొస్తాం
ప్రతిష్ఠాత్మకంగా మిస్ వరల్డ్ పోటీలు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు
ఎస్‌ఆర్‌డీపీ, మెట్రో, వాటర్ వర్క్స్,హెరిటేజ్ పనుల పరిశీలన
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు అధికారులకు సూచించారు. నగరంలో ఎస్‌ఆర్‌డీ పీ, ఇతర శాఖల ద్వారా చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆదివారం ఆయన పరిశీ లించారు. ముందుగా బంజారాహిల్స్‌లో జీవీకే మాల్ వద్ద సుమారు రూ.5కోట్ల వ్య యంతో చేపట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ప్రధాన కార్యదర్శి సందర్శించారు.
అనంతరం దారుషిఫా వద్ద మెట్రో లైన్ అలైన్‌మెంట్ (ఓల్డ్ సిటీ కారిడార్) పరిశీలించారు. ఓల్డ్ సిటీ కారిడార్ ఎంజీబీఎస్ బస్‌స్టేషన్ నుంచి చాంద్రా యణగుట్ట వరకు రూ.2,741కోట్ల వ్యయం తో చేపట్టే మెట్రోలైన్ పనుల గురించి మెట్రోలైన్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి సీఎస్‌కు వివరించారు. భూసేకరణ ప్రక్రియ వేగవంతం గా చేయాల్సి ఉందని, భూసేకరణపై ప్రజలు సహకరిస్తున్నట్టు తెలియజేశారు. హుస్సేన్ ఆలమ్‌లో ఉన్న ఖుర్షీద్ ఝా దేవిడి హెరిటే జ్ భవనం హెచ్‌ఎండీఏ నిధులతో కన్జర్వేషన్ రెస్టోరేషన్, మరమ్మతు పనులను సీఎస్ పరిశీలించారు.
ఈ సందర్భంగా రామకృష్ణారావు నిర్వాహకులతో మాట్లాడుతూ.. పార్కింగ్ అనువైన స్థలం ఉన్న నేపథ్యంలో హెరిటేజ్ భవనం మెయింటనెన్స్ కోసం ఎగ్జిబిషన్ ఇతరత్ర వినూత్న కార్యక్రమాలు నిర్వహించి నిధులు రాబట్టుకోవాలన్నారు. ఫలక్‌నూమా ఆర్‌వోబీ పనులను పరిశీలించిన సందర్భంగా జీహెచ్‌ఎంసీకి సంబంధిం చిన పనులు తుదిదశలో ఉన్నాయని, రైల్వే పోర్షన్ పూర్తిచేసిన తర్వాత సర్వీస్ రోడ్డుకు 5 ఆస్తుల సేకరణ పూర్తి చేసి నెలరోజుల్లో పూర్తి చేయడానికి చర్యలు తీసుకున్నట్టు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇలంబర్తి వివరించారు.
ఆగస్టు వరకు పూర్తిచేయాలని సీఎస్ ఆదేశించడంతో తప్పనిస రిగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామని, రైల్వే పోర్షన్ పనులు మొదలుపెట్టిన నేపథ్యంలో ఆగస్టు చివరి వరకు పూర్తవుతాయని వివరించారు. ఫలక్‌నుమా ఫ్లుఓవర్ నుంచి నల్గొండ ఫ్లుఓవర్ పనులను, మూసినదిపై ముసారాంబాగ్ వద్ద చేపట్టిన బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. అక్కడ నుంచి వాటర్ వర్క్స్ ద్వారా చేపట్టిన ఎస్‌టీపీ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్: సీఎస్ కే రామకృష్ణారావు
హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారని కే రామకృష్ణారావు చెప్పారు. సీఎం ఆదేశాలతో హైదరాబాద్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించామని వెల్లడించారు. ఓల్డ్ సిటీ మెట్రోకు నిధుల కొరత లేదని, ఓల్డ్ సిటీ మెట్రోకు ఆస్తుల సేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ ద్వారా నిర్మిస్తున్న ఫ్లుఓవర్ ఇతర మౌలిక సదుపాయాల పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించినట్టు పేర్కొన్నారు.
ముసారాంబాగ్ బ్రిడ్జి పనులను పూర్తిచేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తానని వెల్లడించారు. జలమండలి నిర్మిస్తున్న ఎస్టీపీలన్నీ అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించే మిస్ వరల్డ్ పోటీను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. మిస్ వరల్డ్ పోటీలకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టూరిజం శాఖతో అన్ని శాఖలు సమన్వయం చేసుకొని మిస్ వరల్డ్ పోటీలు విజయవంతం చేస్తామని తెలిపారు.
అభివృద్ధి పనుల పరిశీలనలో ఎంఏయూడీ సెక్రటరీ కే ఇలంబర్తి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, మెట్రో రైల్వే ఎండీ ఎన్‌వీఎస్‌రెడ్డి, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ ప్రాజెక్టు మెయింటెనెన్స్ సీఈలు భాస్కర్‌రెడ్డి, రత్నాకర్, కులీ కుతుబ్‌షా అభివృద్ధి అథారిటీ అధికారులు, చార్మినార్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్లు వెంకన్న, రవికిరణ్, ప్రాజెక్ట్ ఈఈ రోహిణి, బీఎల్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.