05-05-2025 06:31:25 PM
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): గత మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న వేతనాలు చెల్లించాలని, కాంట్రాక్ట్ పొడగింపుపై ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల ఎదుట సోమవారం నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మూడు నెలల జీతాలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల ఎదుట నిరసనలు తెలపాలని రాష్ట్ర కమిటి పిలుపునిచ్చింది.
కాగా భూపాలపల్లి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో సోమవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ, హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ నవీన్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఓటి టెక్నీషియన్స్ బిక్షపతి గౌడ్, నవీన్, సుజాత, ఫార్మాసిస్టులు స్వప్న కుమారి, సుప్రియ, ఎక్సరే టెక్నీషియన్ వెంకట్, తిలక్, ఈసీజీ టెక్నీషియన్ రాజేందర్, ఆప్తల్ అసిస్టెంట్ టెక్నీషియన్ రవళి, ల్యాబ్ టెక్నీషియన్ నవ్య తదితరులు నిరసనలో పాల్గొన్నారు.