calender_icon.png 18 July, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చంపాపేట డివిజన్‌లో అభివృద్ధి పనులు

16-07-2025 12:02:16 AM

- పనులను పరిశీలించిన కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి 

ఎల్బీనగర్, జులై 15 : చంపాపేట డివిజన్ ను అభివృద్ధి చేయటమే నా ధ్యేయమని బీ జేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి అన్నారు. రూ.1 కోటి 50 లక్షలతో కర్మన్ ఘాట్ వైఎస్సార్ వి గ్రహం నుంచి భగత్ సింగ్ యువజన సంఘం వరకు వరద నీటి కాలువ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రూ.60 లక్షల తో కర్మన్ ఘాట్ వైఎస్సార్ విగ్రహం నుంచి భగత్ సింగ్ యువజన సంఘం వరకు సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి.

చంపాపేట్ డివిజన్ పరిధిలో కర్మంఘాట్ ఓల్ వి లేజ్‌లో నిర్మిస్తున్న వరద నీటి కాలువ, సీసీ రోడ్ నిర్మాణ పనులను జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... రోడ్డు విస్తరణ కొరకు అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించాలన్నారు. రహదారి పక్కనే అక్రమ ని ర్మాణాల కారణంగా రాకపోకలకు ఇబ్బందవుతుందని, రహదారికి అడ్డంగా నిర్మించిన షెడ్లను త్వరగా తొలగించాలని టౌన్ ప్లా నింగ్ అధికారులను ఆదేశించారు.

రోడ్ల ని ర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించి, ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షించాలని సూచించారు కార్యక్రమంలో టౌన్ ప్లా నింగ్ ఏసీపీ ప్రతాప్, టీపీఎస్ అర్చన, ఏఈ సురేశ్, వర్క్ ఇన్ స్పెక్టర్ రాజు, బిజెపి సీనియర్ నాయకులు లింగాల దశరథ్ గౌడ్, సుంకరి రమేశ్ గౌడ్, నరేందర్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, బసంత్, క్రాంతి నగర్ కాలనీ అధ్యక్షు లు ఆనంద్, తదితరులుపాల్గొన్నారు.