calender_icon.png 19 July, 2025 | 7:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీరన్నగుట్ట ఆలయ అభివృద్ధికి కృషి చేస్తా

16-07-2025 12:03:47 AM

- బీఆర్‌ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి 

ఎల్బీనగర్, జులై 15 : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని వీరన్నగుట్ట కాలనీలో ఉ న్న పోచమ్మ తల్లి ఆలయాభివృద్ధికి కృషి చేస్తానని బీఆర్‌ఎస్ నాయకుడు జక్కిడి ర ఘువీర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయ న ఆలయాన్ని సందర్శించి, అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆలయ అభివృద్ధికి తన వంతుగా రూ, 20 వేల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు ఆ యన అందజేశారు. ప్రజలందరిపై పోచమ్మ తల్లి దీవెనలు ఉండాలని, అందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో జీవించాలని ఆ యన కోరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ సంక్షేమ సంఘం నాయకులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలుపాల్గొన్నారు.