01-07-2025 01:39:04 AM
నగరాన్ని అందంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్‌ఎస్‌దే: ఎమ్మెల్యే గంగుల
కరీంనగర్, జూన్ 30 (విజయ క్రాంతి): రాష్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడ్డాకా 18 నెలలుగా ఎక్కడా అభివృద్ది పనులు జరిగిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఎక్కడిక్కడ అభివృద్ది పనులు నిలిచిపోయాయని, పెండింగ్ లో ఉన్న 65 అభివృద్ది పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
18 నెలలగా పనులు జరగడం లేదన్నారు. సోమవారం కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ని చాంబర్లో కలిసి నగరపాలక సంస్థ పరిధిలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై మాజీ కార్పొరేటర్లతో కలసి కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఎక్కడ లేని విధంగా తీగల వంతెన వద్ద వెలుగులు దివ్వెలు కనిపించేవని, ప్రస్తుతం అక్కడ కా కుండా మరెక్కడా ఒక్క బుగ్గ వెలగడం లేదన్నారు.
పలు హైలాండ్స్లో అంధాకారంగా మారిందన్నారు. కరీంనగర్లో తాగునీరు అందని పరిస్థితి ఏర్పడిందని, మున్సిపాలిటిలో అస్థవ్యస్థంగా మా రిందన్నారు. కరీంనగర్ నగర ప్రజలను 24 గంటల పాటు మున్సిపల్ నల్లాల ద్వారా నీరు అం దించాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో టిఆర్‌ఎస్ ప్రభుత్వం హాయాంలో మట్టి రోడ్డు లేకుండా అభివృద్ది చేశామన్నారు. కేసీఆర్ పాలనలో కరీంనగర్ ముందున్నడూ లేని విధంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ది జరిగిందన్నారు.అందమైన నగరంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు.
ప్రత్యేక అధికారుల పాలనలో అభివృద్ది మరింత వెనక్కు వెల్లిందన్నారు. ఇక మాకు పోరాటం కొత్త కాదు లేని పక్షంలో బీఆర్‌ఎస్ అధ్వర్యంలో ఉద్యమం తప్పదన్నారు. కరీంనగర్లో గత కొంత కాలంగా డంపింగ్ యార్డు సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆ స మస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ కార్పోరేటర్లు, మాజీ కార్పోరేటర్లు, నాయకులు, తదితరులుపాల్గొన్నారు.