13 May, 2026 | 4:43 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

భక్తులతో కిక్కిరిసిన హేమాచల పుణ్య క్షేత్రం

10-08-2025 11:17 PM

మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరులో స్వయంభుగా వెలసిన మహా పుణ్య క్షేత్రం తెలంగాణ రాష్ట్రంలో రెండో యాదాద్రిగా పేరుగాంచిన శ్రీ హేమచల లక్ష్మి నృసింహ స్వామి ఆదిలక్ష్మి చెంచులక్ష్మి దైత అమ్మవార్లను దర్శించుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాలలోని భక్తులు ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో ఆలయానికి విచ్చేసి చింతామణి జలపాతం (అక్కథార, చెల్లెధార)లో స్నానం ఆచరించి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ ప్రాంగణం స్వామివారి నామ స్మరణతో మార్మోగింది.