calender_icon.png 24 January, 2026 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తజన మేడారం

24-01-2026 12:28:12 AM

  1.   5 లక్షలకు పైగా జనం రాక
  2. వనదేవతలకు మొక్కులు
  3. జంపన్న వాగులో గల్లంతైన వారిని రక్షించిన రెస్క్యూ టీం 
  4. హోర్డింగు కూలి భక్తుడికి గాయాలు 

మేడారం, జనవరి 23 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్తుల రాక రోజు రోజుకూ పెరుగుతున్నది. శుక్రవారం 5 లక్షలకు పైగా భక్తులు వనదేవతల దర్శనానికి వచ్చినట్లు అధికార వర్గాలు పేర్కొం టున్నాయి. జంపన్నవాగు పుణ్యస్నానం ఆచరించే భక్తులతో కిక్కిరిసిపోయింది. భూపాలపల్లికి చెందిన మేకల జంపయ్య, మేకల సరిత, మేకల శిరీష జంపన్నవాగులో స్నానం చేస్తూ నీట మునిగిపోయారు. అక్కడే విధుల్లో ఉన్న ఎస్‌డిఆర్‌ఎఫ్ సిబ్బంది వారిని రక్షించారు.

జాతరలో హరితహోటల్ జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ లైటింగ్ నేమ్ బోర్డ్ ఒక్కసారిగా కూలింది. అక్కడే ఉన్న మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండ లం రాంపూర్‌కు చెందిన ఎడ్ల నరసయ్యకు గాయాలు అయ్యాయి. టీటీడీ కళ్యాణ మండపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహించారు.

వనదేవతల గద్దెల ప్రాం గణంలో శుక్రవారం భక్తులు విసిరిన కొబ్బరికాయలు బంగారం (బెల్లం) తగిలి 9 మంది గాయపడ్డారు. కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నా థ్ జాతరలో భక్తుల రద్దీ నియంత్రణ, వసతుల కల్పన అంశాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.