24-01-2026 12:27:16 AM
సుభాష్ చంద్రబోస్ భారత యువతకు ధైర్యం, దేశభక్తి, ఆత్మగౌరవాన్ని నేర్పిన మహానాయకుడు: రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్
ఘట్ కేసర్, జనవరి 23 (విజయక్రాంతి) : భారత యువతకు ధైర్యం, దేశభక్తి, ఆత్మగౌరవాన్ని నేర్పిన మహానాయకుడు సుభాష్ చంద్రబోస్ అని రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ అన్నారు. ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ఖేలో ఇండియావరంగల్ పర్యటనలో భాగంగా ఘట్ కేసర్ వందన హోటల్ సమీపంలో మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకొని నేతాజీ ఫోటోకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ సుభాష్ చంద్రబోస్ కేవలం స్వాతంత్య్ర సమరయోధుడు మాత్రమే కాదని, భారత యువతకు ధైర్యం, దేశభక్తి, ఆత్మగౌరవాన్ని నేర్పిన మహానాయకుడన్నారు. మీరు నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్య్రం ఇస్తాను అనే ఆయన నినాదం నేటికీ ప్రతి భారతీయుడి హృదయాన్ని కదిలిస్తుందని, దేశం కోసం త్యాగం చేయాలనే భావనను నేతాజీ మన రక్తంలో నింపారు అని తెలిపారు. ఇలాంటి మహానాయకుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత అని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బిజెపి రాష్ట్ర నాయకులు మనోహర్ రెడ్డి, రామోజీ, రైతు సొసైటీ చైర్మన్ సింగిరెడ్డి రామిరెడ్డి, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు కొమ్మిడి మహిపాల్ రెడ్డి, మండల అధ్యక్షులు చలువాది ప్రవీణ్ రావు, యూత్ అధ్యక్షులు కుమ్మిడి విక్రాంత్ రెడ్డి, టిడిపి అధ్యక్షులు వేముల సంజీవ గౌడ్, మారం లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో
మేడ్చల్ అర్బన్, జనవరి 23(విజయక్రాంతి): స్వాతంత్య్ర సమరయోధులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129 వ జయంతి వేడుకలను బిజెపి ఆధ్వర్యంలో మేడ్చల్, గుండ్లపోచంపల్లి, ఎల్లంపేటలో ఘనంగా నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర నాయకులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ భారత దేశ స్వాతంత్య్ర సంగ్రామంలో ‘ఆజాద్ హింద్‘స్థాపించి అలుపె రగని పోరాటం చేసిన దిశాలి దేశభక్తులు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక్కరేనని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి అమరం మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు సముద్రాల హంస రాణీ కృష్ణ గౌడ్, దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్, జిల్లా ఉపాధ్యక్షులు గౌరారం జగన్ గౌడ్, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సముద్రాల కృష్ణ గౌడ్, మేడ్చల్,గుండ్లపోచంపల్లి,ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణ బిజెపి అధ్యక్షులు కావేరి శ్రీధర్ ముదిరాజ్,జల్లి శైలజ హరినాథ్,ఎక్కల్ దేవి శ్రీశైలం యాదవ్,జిల్లా కోశాధికారి లవంగ శ్రీకాంత్,జాకట ప్రేమ్ దాస్,సిహెచ్ శ్రీనివాస్ గౌడ్,నాయకులు సర్వేశ్వర్ రెడ్డి,మైసరి రాజు,వంగేటి హనుమంత రెడ్డి,బచ్చు కృష్ణప్రియ మల్లారెడ్డి,బట్టికాడి నవనీత, రాఘవరెడ్డి, విజయ్ వంజరి, సిహెచ్ రవీందర్, రాగం అర్జున్, నాగేష్, సిహెచ్ సత్యనారాయణ, నాగేష్, శ్రీనివాస్ గౌడ్, చుక్క సత్యనారాయణ, బందెల స్వామి, మహేందర్ యాదవ్, భాస్కర్, మండల రవీందర్ గౌడ్, జైతువాల కిషన్, విక్రమ్, నవీన్, అభిలాష్, అరుణ్, శ్రావణ్, భాను,శ్రీను, బాలస్వామి పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
మేడ్చల్ అర్బన్, జనవరి 23(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత దేశ స్వాతంత్ర సమరంలో ఎంతో పోరాడారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఆర్ మల్లికార్జున స్వామి.మాజీ వార్డు సభ్యులు దాత్రిక లక్ష్మణ్ వంజరి, యువ నాయకులు సత్యనారాయణ,రాజి రెడ్డి,పెంజర్ల సాయి యాదవ్,బాలు,సునీల్,రామకృష్ణ.బద్రీనాథ్ పంతులు,కవిరాజు,నాగరాజు స్వామి వివేకానంద విగ్రహ ప్రతిష్ట కమిటీ సభ్యులు పాల్గొన్నారు..
యువతలో స్ఫూర్తి నింపిన ధీశాలి
కందుకూరు, జనవరి 23 (విజయక్రాంతి): భారత స్వాతంత్య్ర సంగ్రామంలో యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపి, దేశ విముక్తికి బాటలు వేసిన మహానీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని ఏబీవీపీ నాయకులు కందడి శ్రీరామ్ కొనియాడారు. శుక్రవారం కందుకూరులో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నేతాజీ వంటి మహానుభావుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని శ్రీరామ్ పేర్కొన్నారు.’జై హింద్’ నినాదంతో యువతలో దేశభక్తిని రగిలించి, ‘మీ రక్తాన్ని ఇవ్వండి.. మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తాను‘ అంటూ ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా బ్రిటీష్ పాలకుల గుండెల్లో నేతాజీ వణుకు పుట్టించారని గుర్తుచేశారు.
ప్రస్తుత తరుణంలో యువత అంతా దేశభక్తిని పెంపొందించుకుని, జాతీయ శక్తిగా ఎదిగి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డిల్లీ భాను ప్రసాద్, నగర కార్యదర్శి వినయ్ పాల్గొన్నారు. వీరితో పాటు చంటి, వంశీ, మణి, మహేశ్, విశ్వనాథ్, మణికంఠ, శివ, కిరణ్, ధరణి, నందకిశోర్ తదితర ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొని నేతాజీకి నివాళులర్పించారు.