26-01-2026 12:03:33 AM
గణపతి పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, జనవరి 25(విజయ క్రాంతి): భక్తి భావం మనలోని ఆధ్యాత్మికత భావాన్ని పెంపొందిస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. నార్కెట్పల్లి మండలం చెర్వుగట్టు గ్రామంలోని పార్వతి జడల రామలింగేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన గణపతి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకుని, నియోజకవర్గ ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆరోగ్యం, శాంతి సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు. బ్రహ్మోత్సవాలు భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంపొందించే మహత్తర కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో,అర్చకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.