calender_icon.png 26 January, 2026 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీఆర్పీలో భారీగా చేరికలు

26-01-2026 01:38:06 AM

  1. ఇది ఆరంభం మాత్రమే.. 
  2. ఎన్నికల నాటికి అగ్రవర్ణ పార్టీలు ఖాళీ అవ్వడం ఖాయం 
  3. పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, జనవరి 25(విజయక్రాంతి) : జనగామ జిల్లాలో అధికార పార్టీ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు గట్టి షాక్ తగిలింది. ఆయా పార్టీలకు చెందిన కార్యకర్తలు పెద్ద సం ఖ్యలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ)లో చేరారు. టీఆర్పీ జనగామ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేశ్ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పార్టీలకు చెందిన బీసీ, మైనారిటీ, నాయకులు టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సమక్షంలో ఆదివారం పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి మల్లన్న కండువా కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలని పిలుపు నిచ్చారు. నాయకులు,కార్యకర్తలు నిబద్దత, అంకిత భావంతో పనిచేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో యూత్ జిల్లా అధ్యక్షుడు మంద దిలీప్, యూత్ నియోజకవర్గ అధ్యక్షుడు బోడా రమేశ్,యాకుబ్ పాషా, బబ్బులు, జలీల్ పాషా, మహ్మద్ అస్లాం,అబ్దుల్ రహీం, రాజు, లక్ష్మణ్, రాజేందర్, ప్రశాంత్ రాజు, ఆశు, తదితరులు పాల్గొన్నారు. 

గ్రేటర్ హైదరాబాద్‌లో టీఆర్పీ నియామకాలు

తెలంగాణ రాజ్యాధికార పార్టీ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్‌గా మహేందర్ జైన్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత   మల్లన్న ఆయనకు నియామక పత్రాన్ని ఆదివారం పార్టీ కార్యాలయంలో అందజే శారు. అనంతరం ఆర్. భావన వెంకటేశ్ పార్టీ గుర్తు కత్తెరను బహుమానంగా ఎమ్మెల్సీ మల్లన్నకి అందజేశారు. గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్‌గా రంగరాజు అనిల్ కుమార్ పటేల్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కిశోర్ కుమార్ గౌడ్, జనరల్ సెక్రటరీగా కృష్ణ కుమార్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా సందీప్ రవిపాటిలను నియమిస్తూ, వారికి కూడా నియామక పత్రాలను అందజేశారు.

కార్యక్రమం ఉమ్మ డి హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి ఆర్.భావన వెంకటేశ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.  పార్టీ ఉపాధ్యక్షుడు ఎల్లబోయిన ఓదెలుయాదవ్, కార్వాన్ నియోజకవర్గ ఇన్‌చార్జి టీవీఆర్‌తో తదితర ముఖ్యనాయకులు పాల్గొన్నారు. నియమితులైన నాయకులు మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని అన్ని డివిజన్లలో బలోపేతం చేసి, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, రాబోయే ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని స్పష్టం చేశారు.