26-01-2026 12:04:17 AM
భద్రాద్రి కొత్తగూడెం జనవరి 25 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖలో డిఎస్పీల బదిలీలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇద్దరు డిఎస్పిలకు స్థానచలనం కలిగింది. ఇల్లందు డి.ఎస్.పి చంద్రభాను, కొత్తగూడెం డిఎస్పి అబ్దుల్ రహమాన్ లు బదిలీ చేశారు. ఇల్లందు డిఎస్పీగా టీ జీ పీ ఏ లో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఎస్ సారంగపాణిని, కొత్తగూడెం డిఎస్పీగా హైదరాబాదులోని ఏసిపి, సి సి పి, డిడి గా విధులు నిర్వహిస్తున్న ఎల్ ఆదినారాయణ నియమిస్తూ డిజిపి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నుంచి బదిలీ అయిన ఇద్దరు డిఎస్పీ లను డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాల్సింగా ఉత్తర్వులు ఇచ్చారు.