calender_icon.png 23 December, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెల అభివృద్ధి సర్పంచులతోనే సాధ్యం

23-12-2025 12:37:28 AM

లోయపల్లీ శ్రీనివాసరావు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామపంచాయతీ నూతన పాలకవర్గ  ప్రమాణ స్వీకార కార్యక్రమాలలో ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ పాల్గొని నూతన పాలకవర్గం కి పదవి ప్రమాణస్వీకారం సోమవారం చేయించారు.  గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు లోయపల్లి శ్రీనివాసరావు, ఉప సర్పంచ్ నీల స్వామి,వార్డు సభ్యులు లకు  ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి బి సంతోష్ కుమార్, గ్రామ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.