calender_icon.png 23 December, 2025 | 3:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల ఖర్చు @రూ.9.50 కోట్లు

23-12-2025 01:29:44 AM

పెద్ద గ్రామ పంచాయతీలకు 60 లక్షలు, చిన్న గ్రామ పంచాయతీలకు 40 లక్షల ఖర్చు

మండలంలోని 12 గ్రామపంచాయతీలో అదే తీరు..

గెలుపు కొరకు భూములు ఆస్తుల అమ్మకాలు అభ్యర్థులు

వేములపల్లి, డిసెంబర్ 22 (విజయక్రాంతి): రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్ని కలు పూర్తి కాగా, సర్పంచులు ప్రమాణ స్వీకారాలు చేశారు.  అయితే వేములపల్లి మండలంలో రెండో విడతలో 12 గ్రామపంచాయతీలో భాగంగా ఎన్నికలు పూర్తి అయ్యాయి. వేములపల్లి లో 3602 ఓటర్లు ఉండగా, శెట్టిపాలెం 3411, తిమ్మారెడ్డి గూడెం 654, మొల్కపట్నం 1692, అన్నపురెడ్డిగూడెం 760, రావులపెంట 2709, సల్కునూరు 1581, మంగాపురం 765, లక్ష్మీదేవి గూడెం 1169, ఆమనగల్లు 2475, 625, బుగ్గ బాయ్ గూడెం 1002 ఓటర్లు ఉండగా 12 గ్రామపంచాయతీలో మొత్తం ఓటర్లు 20568 మంది ఓటర్లు ఉన్నారు.

కాగా గెలుపు కోసం సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన వారు చేసిన ఖర్చు సుమారు రూ.9.50 కోట్ల పైచిలుకే అని రాజకీయ విశ్లేషకులు, ఆయా గ్రామాల ప్రజలు బహిరం గంగానే చర్చించుకుంటున్నారు. పోటీదారులు కొంతమంది గెలవాల ని తపనతో వారికున్న కొద్దిపాటి భూములను సైతం అమ్మడానికి వెనుకాడ లేదు. అదేవిధంగా గెలుపు కోసం తమకున్న ఇళ్ళు, బంగారం పై రుణాలు తీసుకొని మరి ఖర్చు చేశారనేది వినికిడి. మేజర్ గ్రామపంచాయతీలకు రూ 60 నుంచి 70 లక్షలు, చిన్న గ్రా మ పంచాయతీలకు రూ.40 నుంచి 50 లక్షలు ఖర్చుపెట్టి గెలిస్తే గ్రామాభివృద్ధి ఎలా సాధ్యమైద్దని విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.

వివిధ పద్ధతులలో ఓటర్లకు గాలం 

సర్పంచులుగా పోటీ చేసిన అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ పద్ధతుల్లో ఆవలంబించారు. దీనికి నిదర్శనమే కొన్ని గ్రామపంచాయతీలలో ఓట్లకు ముందు రోజు రాత్రి మహిళలకు చీరలు, ఇంటికి కేజీ చికెన్ ను పంపిణీ చేశారు.  ఒక అభ్యర్థి ఇచ్చిన నగదు తెలుసుకొని వారి కంటే ఎక్కువ నగదు ఇచ్చేందుకు అభ్యర్థులు పోటీ పడ్డారనేది వినికిడి. అదేవిధంగా కొన్ని గ్రామపంచాయతీలలో 600 నుంచి 700 ఓటర్లు ఉన్న గ్రామ పంచాయతీలలో సైతం ఖర్చు రూ.40 లక్షల దాటిందంటేనే డబ్బుల ప్రభావం ఓటర్ల పై ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని  విశ్లేషకులు అంటున్నారు.

ఏరులై పారిన మద్యం 

గ్రామపంచాయతీ ఎన్నికల సందడి మొదలైన దగ్గర నుండి రిజర్వేషన్ల ఖరారుతో పలువురు అభ్యర్థులు నామినేషన్ వేసిన నాటి నుండే గ్రామాలలో మద్యం ఏరులై పారింది. ఒక ఇంటిలో ఎన్ని ఓట్లు ఉన్నాయని సంబంధం లేకుండా ఓటుకు రోజుకు ఒక క్వార్టర్ చొప్పున పంపిణీ చేయడంతో ఒక ఇంటికి సుమారుగా 10 నుంచి 14 క్వార్టర్లు అందినట్లుగా ప్రజలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. దీంతో కొంతమంది ఓటు వేయడానికి వెళ్లిన సమయంలో మత్తులో మునిగి మతిస్థిమితం లేకుండా బ్యాలెట్ పత్రంపై ఉన్న పలు గుర్తులపై స్వస్తి గుర్తు వేయడంతో కొన్ని ఓట్లు చిన్న కొండ పోయాయి. మండలంలో మందు ఏరులై పారింది అనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికైనా ఈ విధానాలు మారాలని, సర్పంచ్ ఎన్నికలు అంటే నగదు, మద్యం బాటిళ్లకు ఆశపడకుండా అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.