calender_icon.png 23 December, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెలుగుల సిరి, తర‘గని’ మాగాణి సింగరేణి

23-12-2025 12:58:10 AM

బొగ్గుట్ట నుండి ఇతర రాష్ట్రాలతోపాటు  

విదేశాల వరకు విస్తరణ   

బొగ్గు ఉత్పత్తిలో 13 దశాబ్దాల సుధీర్ఘ ప్రస్తానం

నల్ల బంగారు లోకం నుండి మేలిమి బంగారు గనుల వైపు అడుగులు 

బొగ్గు ఆధారిత అనుబంధ, విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమల స్థాపనతో ప్రగతి 

బొగ్గు అన్వేషణలో అత్యాధునిక సాంకేతి క టెక్నాలజీతో కొత్తపుంతలు

నూతన ఆవిష్కరణలతో ప్రగతికి ముందడుగు 

సంస్థను వెంటాడుతున్న సమస్యల సవాళ్లు

నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం

మణుగూరు,డిసెంబర్22,(విజయక్రాంతి): సిరివెలుగులను విరజిమ్మే సింగరేణి బంగా రం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారం అంటూ, ఓ గీతంలో సింగరేణి వైభవానికి అద్దం పట్టే అక్షరాలు ఇవి. ఆలా రాష్ట్రంలో బొగ్గు పేరెత్తగానే సింగరేణియే గుర్తుకొస్తుంది. నల్లబంగారానికి సింగరేణి ప ర్యాయపదమైంది.ఆంగ్లేయుల కాలంలో పురుడు పోసుకొని, నిజాం పాలనలో నిలదొక్కుకొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వ ర్యంలో ప్రత్యేకతను చాటుకుంటోంది. చిన్న గ్రామం బోగుట్టలో మొదలైన సంస్థ క్రమక్రమంగా విస్తరించింది.

నేడు వేలాది మం దికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ, దేశంలో వేల పరిశ్రమలకు ఇంధనాన్ని అం దిస్తున్న నల్ల బంగారుగని సింగరేణి. దేశంలోనే మొట్ట మొదట బొగ్గు ఉత్పత్తి రంగం లోకి అడు గుపెట్టిన ప్రభుత్వరంగ సంస్థగా  తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రను లిఖించుకుంది.13 దశాబ్దాల  సుదీర్ఘ ప్రస్థానంలో దినదినం అభివృద్ధి చెందుతూ, దక్షిణ భారత దేశానికి వెలుగులు పంచుతూ, ప్రగ తి పథంలో పయనిస్తూ,తెలంగాణకు కొంగు బంగారంగా విరాజిల్లుతుంది. నేడు అవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్న వేళ సింగరేణి ప్రస్థానంపై  విజయక్రాంతి  ప్రత్యే క కథనం..

బొగ్గుట్ట నుండి సింగరేణి ప్రస్థానం&సింగరేణి కాలరీస్ కంపెనీకి 13 దశాబ్దాల మ హోన్నత చరిత్ర ఉంది. భద్రాద్రిరాముడి  దర్శనం కోసం వెళ్తున్న భక్తులు వంట కోసం పొయ్యి రాళ్లను ఏర్పాటు చేసుకోగా, అవి మండటంతో తొలిసారిగా బొగ్గు ఖనిజం వెలుగులోకి వచ్చింది. నాటి బ్రిటిష్ ప్రభుత్వంలో 1870లో బ్రిటిష్ శాస్త్ర వేత్త విలియం కింగ్ పరిశోధనలతో ఇక్కడ బొగ్గు నిక్షేపాలు ఉన్నాయని కనుగొనడంతో సింగరేణి ప్రస్థా నం మొదలైంది.1886లో ఇల్లెందులో తొలిసారిగా తవ్వకా లు ప్రారంభించారు. 1889 లో వాణిజ్య పరంగా బొగ్గు ఉత్పత్తి మొదలైంది. 

దక్కన్ కంపెనీగా..

మొట్టమొదటగా దీనికి దక్కన్ కంపెనీగా పేరు నమోదు చేసి ఇంగ్లాండ్లో కేంద్ర కార్యాలయాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత 1921లో దక్కన్ కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని మద్రా స్కు తరలించారు. 1889లో ఉత్పత్తిని ప్రా రంభించింది. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా రూపాం తరం చెందింది. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా హైదరాబాద్ కంపెనీస్ యాక్టు ప్రకారం న మోదైన సింగరేణి తొలుత బ్రిటిష్ పాలకుల అజమాయిషీ లో పనిచేసింది. ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్ర నైజాం రాజు అజమాయిషీలోకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ త రువాత రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ అధీనంలో కొనసాగింది. ఎన్నో కష్ట నష్టాల ను భరించి,అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రస్తుతం విజయపథంలో దూసుకెళుతోంది.

బొగ్గు నుంచి, బంగారు గనుల దాక.. 

మొదట్లో చాల కొద్ది ప్రాంతానికే పరిమిత మైన సింగరేణి బొగ్గు గనులు కాల గ మనంలో విస్తరించాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లా ల్లో విస్తరించి ఉన్న గోదావరి పరీవాహక ప్రాంతంలోని 350 కిలో మీటర్ల మేరనిక్షిప్తమై ఉన్న అపారమైన బొగ్గు ఖనిజాన్ని ఈ సంస్థ తవ్వి తీస్తోంది. దక్షిణ భారతదేశంలో సుమారు నాలుగు వేల పరిశ్రమలకు, విద్యు త్ ఉత్పత్తి సంస్థలకు కావలసిన ఇంధనం ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంలో కొన సాగుతోంది. మూడు తరాల కార్మికుల చెమట చుక్కలకు ప్రత్యక్ష నిదర్శనంగా సింగరేణి విరాజిల్లుతోంది. కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వాలకు వందల కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతోంది.  బొగ్గును వెలికితీశారు.

ఆధునిక టెక్నాలజీతో కొత్తపుంతలు

ఒకప్పుడు తట్టా చెమ్మస్తో బొగ్గు ఉత్ప త్తిని ప్రారంభించిన సింగరేణి, కాలాను గుణంగా కొత్త టెక్నాలజీని అందిపుచ్చు కుం టూ ఉత్పత్తిలో అనేక కొత్త రికార్డులు నెలకొల్పుతోంది. బొగ్గు ఉత్పత్తి కార్యక లాపాలు ప్రారంభమైన 1889లో ఏటా 59 వేల 671 టన్నుల బొగ్గు తవ్విన కంపెనీ, ప్రస్తుతం 28 అండర్‌గ్రౌండ్ బొగ్గుగనులు, 18 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల ద్వారా 70 మిలి యన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంతో దూసుకుపోతున్నది. భూమి పొరల్లో దాగి ఉన్న నల్లబంగారు మాగాణిని వెలికి తీస్తుంది

సంస్థను వెంటాడుతున్న సమస్యల సవాళ్లు..

1990 దశకంలో సింగరేణి మనగడే కష్టంగా మారి రెండు సార్లు దాదాపుగా సంస్థ మూసివేత పరిస్థితిలు నెలకొన్నాయి. నాటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో సంస్థకు 1000 కోట్ల రుణసాయం చెయ్య గా.. ఉద్యోగులు, అధికారులు సమష్టి కృషి తో సింగరేణిని కాపాడుకోవటమే ఏకైక లక్ష్యంగా చెమటోడ్చి అనతికాలం లోనే అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించి సింగరేణిని లాభాల్లో బాట పట్టించారు.ఆర్థిక సంస్కరణలు కారణంగా బొగ్గు ఉత్పత్తి రంగంలోకి ప్రవేట్ సంస్థలు ప్రవేశంతో పాటు విదేశాల నుండి బొగ్గు దిగుమతి సింగరేణికి గట్టి పోటీగా మారింది.

గతంలో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు బ్లాకులు నేరుగా సింగరేణికే దక్కేవి. కానీ కేంద్ర ప్రభు త్వం అమల్లోకి తెచ్చిన బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ కారణంగా సింగరేణి సంస్థ సర్వే చేసి గుర్తించి నేరుగా దక్కించుకోవాల్సిన బొగ్గు గనులను సైతం ఇతర ప్రైవేటు, ప్రభుత్వ రంగ సంస్థలతో పోటీపడి వేలంలో సింగరేణి సంస్థ దక్కించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ రంగ సంస్థగా నాటి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణి సంస్థ వేలం ప్రక్రియలో పాల్గొనకపోవటంతో రెం డు అతి పెద్ద బ్లాకులు సత్తుపల్లి, కోయగూడెం ప్రైవేటు కంపెనీలు దక్కించుకో వటంతో సింగరేణి వేల కోట్లల్లో ఆదాయాన్ని కోల్పోయింది.

ఒకవైపు సింగరేణికి ఉన్న బొగ్గు నిక్షేపాలు కరిగిపోవడం కొత్తగా బొగ్గు నిక్షేపాలు నేరుగా కేటాయించే పరిస్థితి లేకపోవడం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా థర్మ ల్ విద్యుత్ తయారీ విధానానికి స్వస్తి పలికేందుకు ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరి ణామాలతో ఉద్యోగుల భవిష్యత్తు, సంస్థ మనుగడను, రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని బొగ్గు ఉత్పత్తి సంస్థగానే కాక సింగరేణి సంస్థ థర్మల్ విద్యుత్, సోలార్ విద్యుత్తు, గ్రీన్ ఎనర్జీ రంగాలపై ఇప్పటికే దృష్టి సారించింది. సింగరేణి గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరిట సోలార్, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటులో అడుగులువేస్తోంది.