23-12-2025 01:55:43 AM
హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికలు ముగియడంతో ప్రతిఒక్కరూ సర్పంచుల ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూశారు. ఎట్టకేలకు తెలంగాణ పంచాయతీలకు నూతన కార్యవర్గం కొలువుదీరింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్నర 12 వేలకుపైగా ఉన్న గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం ప్రారంభమైన ఈ కార్యక్రమం కోర్టు మార్గదర్శకాల ప్రకారం నిర్వ హించారు.
రెండేళ్ల విరామం తర్వాత గ్రామస్థాయిలో ప్రజాప్రతినిధుల పాలన పునఃప్రా రంభమైంది. ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు తమ తమ గ్రామాల్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీం తో ఇప్పటివరకు కొనసాగిన స్పెషల్ ఆఫీసర్ల పాలనకు ముగింపు పలికినట్టు అయిం ది. పలుచోట్ల గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన పాలకవర్గాలను అభినందించారు.
ప్రమాణ స్వీకారం అనంతరం గ్రామా భివృద్ధిపై సర్పంచులు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచించారు. పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాలు, అంతర్గత రోడ్ల మెరుగుదలపై తొలి ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ప్రమాణ స్వీకారంతో గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులు వేగం పుంజుకుంటాయని, ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అభివృద్ధి వైపు పల్లెలు నడిసేనా..
22 నెలలుగా గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసా గింది. స్పెషల్ ఆఫీసర్లకు పూర్తి అధికారాలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పను లు నిలిచిపోయాయి. నిధులు విడుదల కాకపోవడం, మరో వైపు స్పెషల్ ఆఫీసర్లకు అధి కారాలు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు మందగించాయి. ఈ నేపథ్యం లో వచ్చే మార్చి కల్లా కేంద్ర ఆర్థిక సంఘం నిధులను సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించింది.
కేంద్రం నుంచి దాదాపుగా రూ.మూడు వేల కోట్ల వరకు ని ధులు రావాల్సి ఉందని అధికారవర్గాలు చె బుతున్నాయి. వీటిని సాధించుకుంటే, కేం ద్రం వెంటనే నిధులు విడుదల చేస్తే గ్రామా ల్లో పేరుకపోయిన బకాయిలు చెల్లించే అవకాశం ఉంటుంది. కొత్తగా అభివృద్ధి పనులు చేపట్టే అవకాశం ఉంటుంది. పారిశుధ్యం, గ్రీనరీ, ప్రజలకు మెరుగైన పాలన అందించే అవకాశం ఉంటుంది. సర్పంచ్‌లు లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు పేరుకుపోయా యని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పాలకవర్గాల ద్వారా గ్రామ పంచాయతీలు కొత్త పంథాలో నడవాలని ఆశిస్తున్నారు.