calender_icon.png 23 December, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉన్నత లక్ష్యాలతో ‘కాకతీయ విద్యాసంస్థలు’

23-12-2025 12:00:00 AM

పాఠశాల చైర్‌పర్సన్, డైరెక్టర్లు

హైదరాబాద్, డిసెంబర్ 22 (విజయక్రాం తి): గణితజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని, కాకతీయ విద్యాసంస్థల ప్రథమ డైరెక్టర్ మండవ సుబ్బారావు స్మారకంగా కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా అకాడమిక్ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవంలో భాగంగా విద్యార్థుల మేధస్సు, నైపుణ్యాలను పెంపొందించేందుకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నోత్తరాల వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

కాకతీయ విద్యాసంస్థల చైర్‌పర్సన్ విజయలక్ష్మి, డైరెక్టర్ రజనీకాంత్, రామోజీరావు, రాజా, తేజస్విని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాకతీయ విద్యాసంస్థలు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. జాతీయస్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

అలాగే క్రీడలలో జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను అభినందిస్తూ, ప్రతి సంవత్సరం నిర్వ హించే క్రీడోత్సవాలతోపాటు అత్యున్నత విద్యా ప్రమాణాలు కలిగిన సిలబస్ ఆధారం గా విద్యార్థుల ప్రతిభను వెలికితీసే కార్యక్రమా లు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిజామాబాద్ పట్టణంలో తొలిసారిగా ఈ తరహా అకాడమిక్ మహోత్సవం నిర్వహించడం గర్వకారణమని పేర్కొన్నారు.కార్యక్రమంలో కాకతీ య విద్యాసంస్థల ప్రిన్సిపాల్స్, నాన్ అకాడమిక్ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.