23-12-2025 12:47:21 AM
* భారత టెస్ట్, వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ టీ20 కెరీర్ ముగిసిందా.. ఫ్యూచర్‌లో అంతర్జాతీయ టీ20ల్లో ఇక మళ్లీ కనిపించడా...ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో దీనిపై తెగ చర్చ జరుగుతోంది. ప్రపంచకప్ టీమ్‌లో చోటు లేకపోవడం చిన్న బ్రేక్ మాత్రమేనని, మళ్లీ రీఎంట్రీ ఇస్తాడని చాలా మంది అంటున్నారు. ఐపీఎల్‌తో గిల్ కమ్ బ్యాక్ బలంగా ఉంటుందంటున్నారు.. మరి గిల్ తన ఆట ఇంకా మార్చుకోవాలా..?
ముంబై, డిసెంబర్ 22 : టీ ట్వంచీ ప్రపంచకప్‌కు జట్టు ను ప్రకటించే ముందు వరకూ ఎటువంటి సంచలనాలు ఉండే అవకాశం లేదని చాలా మంది అనుకున్నారు. అభిమానులే కాదు మాజీ ఆటగాళ్లు సైతం ఇలాగే భావించారు. అయితే ఊహించని విధంగా సెలక్టర్లు ఏకంగా వైస్ కెప్టెన్ నే పక్కన పెట్టారు. శుభమన్ గిల్‌కు టీ20 జట్టులో ప్లేస్ కూడా ఇవ్వలేదు. ఒకవిధంగా చాలా మందికి ఈ నిర్ణ యం షాకిచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే అత ను వైస్ కెప్టెన్, పైగా కోచ్ గంభీర్ కు శిష్యుడు, చీఫ్ సెలక్టర్ అగార్కర్ కు సైతం గిల్‌పై సానుకూలంగానే ఉన్నాడు.
అలాంటిది గిల్‌ను తీసే యడానికి ఎవరు కారణమనే చర్చ కూడా జరుగుతోంది. ఒక జర్నలిస్ట్ తనకున్న సమాచా రం మేరకు కొన్ని కీలక విషయాలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. టీ20 ప్రపంచకప్ కోసం జట్టును ఎంపిక చేసేందుకు సమా వేశం జరిగినప్పుడు గిల్ ప్లేస్‌పై చాలా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. చీఫ్ సెలక్టర్ అగార్కర్, కోచ్ గంభీర్ టీ20 జట్టులో గిల్‌ను కొనసాగించాలని నిర్ణయించారు. అయితే సెలక్షన్ కమిటీలో ఆర్పీ సింగ్, ప్రగ్యాన్ ఓజాతో పాటు మరో సెలక్టర్ మాత్రం వ్యతిరేకించారు.
కోచ్ గంభీర్ గట్టిగా పట్టుబట్టినా కూడా మెజార్టీ సెలక్టర్ల అభిప్రాయానికి తలొగ్గక తప్పలేదు. ఒకదశలో ఆర్పీ సింగ్, ఓజాలను ఒప్పించేందుకు అగార్కర్ ప్రయత్నించినా వారిద్దరూ గిల్ టీ20 గణాంకాలతో పాటు బ్యాటింగ్ శైలి వంటి విషయాలను ప్రస్తావించినట్టు సమాచారం. దీంతో గిల్‌కు వరల్ కప్ జట్టులో ప్లేస్ దక్కలేదు. నిజానికి ఐపీఎల్‌లో గిల్ సక్సెస్‌ఫుల్ బ్యాటర్‌గానే ఉన్నాడు. అతను కెప్టెన్ గా ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు ఎప్పటికప్పుడు అద్భుత ఆరంభాలను ఇస్తూనే ఉన్నాడు.
అయితే అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం అతను వెనుకబడ్డాడనే చెప్పాలి. అభిషేక్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్నప్పుడు చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఒక్కటీ కనిపించలేదు. పైగా దూకుడుగా ఆడలేకపోవడం కూడా ప్రతికూలంగా మారింది. గిల్ ఆటను బెంచ్‌కే పరిమితమైన మరో ఓపెనర్ సంజూ శాంసన్‌తో పోల్చి చూసారు. పవర్ ప్లేలో కూడా అనుకున్నంత వేగంగా పరుగులు చేయలేకపోవడం కూడా గిల్‌కు మైనస్ గా మారింది. ఈ కారణాలతోనే మెగాటోర్నీకి అతన్ని తప్పించినట్టు అర్థమవుతోంది.
వరల్ కప్ టీమ్‌లో చోటు దక్కకపోవడంతో ఇప్పుడు గిల్ టీ20 ఫ్యూచర్‌పై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే అతన్ని బీసీసీఐ మూడు ఫార్మాట్లలోనూ సారథిగా చేయాలని భావించింది. అందుకే మెగాటోర్నీకి ముందు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగించింది. తీరా చూస్తే ఇప్పుడు జట్టులో ప్లేస్ కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అతని అంతర్జాతీయ టీ20 కెరీర్ గురించి చర్చ మొదలైంది.
వరల్ కప్ టీమ్‌లో చోటు దక్కనంత మాత్రాన గిల్ టీ20 కెరీర్ ముగిసిందనుకుంటే అది పొరపాటే అవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అతని వయసును దృష్టిలో ఉంచుకుంటే కమ్ బ్యాక్ ఇవ్వడం ఏమాత్రం కష్టం కాదని తేల్చేస్తున్నారు. ఏదో ఒక దశలో ప్రతీ ప్లేయర్‌కూ ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని , అంత మాత్రాన అతన్ని తీసిపారేయొద్దని చెబుతున్నారు. నిజమే గిల్ రీఎంట్రీ ఇచ్చేందుకు ఐపీఎల్ రూపం లో మరో చక్కని అవకాశం ఎదురుచూస్తోంది.