calender_icon.png 23 December, 2025 | 2:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతి, ప్రేమలకు ప్రతీక క్రిస్టమస్: పటేల్ రమేష్ రెడ్డి

23-12-2025 12:33:43 AM

సూర్యాపేట,(విజయక్రాంతి): శాంతి ప్రేమ సౌబ్రాతృత్వాలకు ప్రతీక క్రిస్టమస్ పండుగని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక లక్ష్మీ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ సంబరాలు – 2025 ప్రేమ విందు కార్యక్రమంలో  ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి,  మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. అన్ని మతాలు, వర్గాలు కలిసి పండుగలను జరుపుకోవడమే తెలంగాణ సంస్కృతి అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వర్గానికి సమాన గౌరవం, సంక్షేమం అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోందన్నారు. క్రైస్తవ సోదర, సోదరీమణులకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఇలాంటి ప్రేమ విందు కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను మరింత బలపరుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, క్రైస్తవ మత పెద్దలు, వివిధ క్రైస్తవ సంఘాల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.