calender_icon.png 15 December, 2025 | 8:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుషాయిగూడ డివిజన్ గా పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ ధర్నా..

15-12-2025 06:55:40 PM

కుషాయిగూడ (విజయక్రాంతి): జీహెచ్ఎంసీ 16వ వార్డును కుషాయిగూడ డివిజన్ గా పేరు మార్చాలని కుషాయిగూడ, చర్లపల్లి కాలనీల కుటుంబాలు ముక్తకంఠంతో సర్కిల్ కార్యాలయం ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. సోమవారం ఉదయం కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ ల సంయుక్త ఆధ్వర్యంలో కుషాయిగూడ బస్టాండ్ నుంచి డప్పు చప్పులతో ప్రారంభమైన నిరసన ర్యాలీ ఊరేగింపుగా ఈసీఐఎల్ చౌరస్తా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ మీదుగా కాప్రా సర్కిల్ కార్యాలయంకు చేరుకుంది. జీహెచ్ఎంసీ అధికారుల, కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మొండి వైఖరి నశించాలి.

16వ డివిజన్ ను కుషాయిగూడ డివిజన్ గా పేరు మార్చాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు చేత పట్టుకొని దాదాపు రెండు గంటల పాటు దిక్కులు పిక్కటిల్లెల నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా ఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, చర్లపల్లి కాలనీల సమాఖ్య సిసిఎస్ అధ్యక్షులు ఎంపల్లి పద్మా రెడ్డిలు మాట్లాడుతూ దశాబ్దాల చరితగల కుషాయిగూడ ప్రాంతం కుషాయిగూడ డిపో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పోలీస్ స్టేషన్, పారిశ్రామిక వాడ, మేడ్చల్ జిల్లా కోర్టుల సముదాయంను 16వ వార్డును కుషాయిగూడ డివిజన్ గా పేరు మార్చాలని, పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానమును చేర్చాలని డిమాండ్ చేశారు. 

అనంతరం డిప్యూటీ కమిషనర్ జగన్ బయటకి రావడంతో సమస్త కుషాయిగూడ ప్రజానీకం ఆకాంక్ష అయిన డివిజన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పనగట్ల చక్రపాణి గౌడ్, యాపురం రవి, సారా అనిల్ ముదిరాజ్, సారా వినోద్ ముదిరాజ్, చల్ల ప్రభాకర్, తాళ్ల ఆనంద్ గౌడ్, చిత్తుల కిషోర్, కళ్యాణ్, గణేష్, బాల నరసింహ రమేష్ చౌదరి రాజేష్ శర్మ సోను చౌదరి చల్ల వెంకటేష్, చందా సంతోష్ అశోక్ కుమార్ గుప్తా, చెన్నోజు భాస్కర్ వాసు కిషోర్ రాగిరి సాకేత్ చంద్రమౌళి దయానంద్ సురేష్ గుప్తా, హరి నాయక్, సంపత్, కాసుల సురేష్ గౌడ్, శంకర్, లడ్డు, కొండగళ్ల అశోక్, బత్తుల రాజిరెడ్డి, శివలింగం, షాబాద్ దామోదర్ రెడ్డి, సత్యనారాయణ, జై, సంపత్ తదితరులు పాల్గొన్నారు.