06-12-2025 12:00:00 AM
మేడ్చల్ అర్బన్ డిసెంబర్ 5 (విజయక్రాంతి):మేడ్చల్ లోని ఎరుకల బస్తి సమీపంలో సెల్ టవర్ ఏర్పాటు చేస్తూ ప్రజలను ఇబ్బందుల గురి చేస్తున్నారని వార్డు ప్రజలు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.
సూర్యాపేట లొకేషన్ చూపిస్తూ మేడ్చల్ లో ఏర్పాటు చేయడం ఎంత వరకు సమంజసం అని స్థానికులు ప్రశ్నించారు.సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.