27-12-2025 02:04:22 AM
జైపూర్ (చెన్నూర్), డిసెంబర్ 26 : చెన్నూర్ నియోజక వర్గం జైపూర్ మండలంలోని పెగడపల్లి గ్రామంలోని సమస్యలను పరిష్కరించాలని పెగడపల్లి సర్పంచ్ రామగిరి రాం కోరారు. శుక్ర వారం జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఈడి చిరంజీవి, ఉన్నత అధికారులను మర్యాదపూర్వకంగా కలిసి శాలువా లతో సన్మానించిన అనంతరం ఆయన పెగడపల్లి గ్రామ అభివృద్ధి, నిరుద్యోగ సమస్యలపైన చర్చించారు.
అధికారులు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్య పరిష్కారానికి పాటుపడుదామని హామీ ఇచ్చినట్లు సర్పంచ్ వెల్లడించారు. ఈ కార్యక్ర మంలో పెగడపల్లి మాజీ సర్పంచులు పడాల మల్లా గౌడ్, రాజా గౌడ్, రిక్కుల అంజిరెడ్డి, మద్దుల మల్లారెడ్డి, మద్దుల మనోహర్ రెడ్డి, ప్రభాకర్ చారి, దూస భాస్కర్, బొప్ప రమేష్, పాలమాకుల రాజేందర్ రెడ్డి, రిక్కుల శేఖర్ రెడ్డి, నరెడ్ల కృష్ణారెడ్డి, పెనుగొండ రాజేశం, చిలకని శ్రావణ్, రామగిరి మధు తదితరులు పాల్గొన్నారు.