calender_icon.png 27 December, 2025 | 3:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వీధి వ్యాపారం..ప్రాణ సంకటం!

27-12-2025 02:00:59 AM

  1. ప్రధాన రోడ్డుపైనే వ్యాపారాలు
  2. ప్రమాదాలకు గురవుతున్న వినియోగదారులు
  3. బస్టాండ్ లోపలికి వెళ్ళేందుకు బస్సులు ఇబ్బంది
  4. ఇటీవల బస్సు ఢీకొని మహిళ మృతి
  5. పట్టించుకోని మున్సిపల్, ఆర్టీసీ అధికారులు

రామాయంపేట, డిసెంబర్ 26 : అధికారుల నిర్లక్ష్యం...పాలకుల పట్టింపులేనిత నంతో ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రధాన రోడ్డుపై వీధి వ్యాపారులు రోడ్డును ఆక్రమిస్తూ వ్యాపారం చేస్తుండగా వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రామాయంపేట పట్టణ కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద ప్రధాన రహదారి పొడువునా వీధి వ్యాపారులు ఉన్నాయి. అయితే మరీ దారుణంగా ఆర్టీసీ బస్టాండ్ లోపలికి బస్సులు కూడా వెళ్ళలేని స్థితిలో వీధి వ్యా పారులు ఆక్రమిస్తున్నారు.

ఇక్కడ కొనుగోలు చేయడానికి వచ్చిన వినియోగదారు లు, ఆర్టీసీ ప్రయాణీకులు రోడ్డుపై నిలబడడంతో ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోన న్న ఆందోళన నెలకొంది. తాజాగా బస్టాండ్ వద్ద బస్సు ఢీకొని రామాయంపేట మండ లం రాయిలాపూర్ గ్రామానికి చెందిన జము ఎల్లవ్వ అనే మహిళ తీవ్రంగా గాయపడ్డి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇందుకు ప్రధాన కారణం బస్సు బస్టాండ్ లోపలికి వెళ్లే సమయంలో మలుపు వద్ద రోడ్డుపై వినియోగదారులు నిలబడి ఉండడమేనని స్థానికులు చెబుతున్నారు. 

నిరుపయోగంగా ఆర్టీసీ దుకాణ సముదాయాలు...

రామాయంపేట ఆర్టీసీకి చెందిన దుకాణ సముదాయాలు చాలా ఏళ్ళ క్రితమే ఏర్పా టు చేశారు. అయితే ఆర్టీసీ అధికారుల నిర్ల క్ష్యం మూలంగా అందులో ఎవరు కూడా వ్యాపారం చేయడం లేదనే ఆరోపణలు ఉ న్నాయి. దీంతో వీధి వ్యాపారులు సైతం దు కాణ సముదాయాల ముందు ప్రధాన రో డ్డుపైనే దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వినియోగదారులు వస్తువు లు కొనుగోలు చేయాలంటే రోడ్డుపైనే నిలబడాల్సి వస్తోంది. బస్టాండ్ లోపలికి వెళ్ళే మలుపు వద్ద కూడా దుకాణాలు ఏర్పాటు చేయడంతో బస్సులు లోపలికి వెళ్ళేందుకు చాలా ఇబ్బంది పడాల్సి వస్తోంది.

వీధి వ్యాపారులను నియంత్రించాల్సిన మున్సిపల్ అధికారులు మామూళ్ళు తీసుకుంటూ నిమ్మకుండి పోయారు. అంతేగాకుండా వారినుండి టాక్స్ వసూలు చేస్తున్నట్లు సమాచారం. వీధి వ్యాపారం చేయడానికి అభ్యంతరం లేకున్నా ప్రధాన రోడ్డుపైకి రావడంతో వినియోగదారులు ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ విషయంలో ఆర్టీసీ అధికారులు సైతం పట్టించుకోక పోవడం శోచనీయం. వీధి వ్యాపారులకు ఆర్టీసీ దుకాణ సముదాయాలను కేటాయిస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు భావిస్తున్నారు.