calender_icon.png 27 December, 2025 | 4:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బిగ్‌బాస్’లో కేటీఆర్, హరీశ్‌రావుకు అవకాశమివ్వండి

27-12-2025 02:04:10 AM

సినీ హీరో నాగార్జునకు ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ సాయికుమార్ లేఖ

హైదరాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి): బిగ్‌బాస్ ప్రోగ్రాంలో బీఆర్‌ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావుకు అవకాశం ఇవ్వాలని సినీ హీరో నాగార్జునకు ఫిషర్మెన్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ లేఖ రాశారు. బిగ్‌బాస్‌లో వీరికి అవకాశమిస్తే మీ టీవీ రేటింగ్ కూడా పెరుగుతుం దన్నారు. కేటీఆర్, హరీశ్‌రావు రాజకీయ నటులుగా పేరు ప్రఖ్యాతులు సాధించారని, అబద్ధాలు చెప్పడంలో రికార్డులు బద్ధలు కొట్టారని విమర్శించారు. ప్రజలను మోసం చేసిన ఇలాంటి చక్కటి నటులను  బిగ్‌బాస్ 10లో అవకాశమిస్తే .. యావత్ దేశానికి ఎంటర్‌టైన్మెంట్ దొరుకుతుందన్నారు.