calender_icon.png 27 December, 2025 | 2:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కోదాడ.. అభివృద్ధికి కేరాఫ్ పద్మావతి

27-12-2025 12:19:33 AM

  1. ఉత్తమ్ పద్మావతి చొరవతో ఊపందుకున్న పనులు          

రూ.15 వందల కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి         

అనతికాలంలోనే అభివృద్ధిలో దూసుకెళుతున్న కోదాడ 

కోట్ల రూపాయల వ్యయంతో మౌలిక వసతుల కల్పన

విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత

సూర్యాపేట, డిసెంబర్ 26 (విజయక్రాంతి) :  కోదాడ నియోజకవర్గ అభివృద్ధి శరవేగంగా ముందుకు సాగుతోంది. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి ప్రత్యేక చొరవతో నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు అనతి కాలంలోనే అభివృద్ధిలో దూసుకు వెళుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఎక్కడ రాజీ పడకుండా అన్ని రంగాలకు ప్రాధాన్యతనిస్తూ నిధులను మంజూరి చేయిస్తున్నారనే చర్చ స్థానికంగా జరుగుతుందంటే ఆమె ఎంత నిబద్ధతతో పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు. 

ఆమె గెలుపుతోనే అభివృద్ధి బాటలోకి 

కోదాడ నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న పాలన ఎమ్మెల్యేగా పద్మావతి గెలిచిన తర్వాత ఒక కుదుటన  పడడంతో పాటు  అభివృద్ధి బాటపట్టిందని నియోజకవర్గ వాసులే చెబుతున్నారు.  ప్రభుత్వం సహకారంతో కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మౌలిక వసతుల పనులు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుస్తున్నాయి.                            

రూ.15 వందల కోట్లతో అభివృద్ధి

ఎమ్మెల్యేగా తనకు ఉన్న పలుకుబడితో పాటు మంత్రిగా ఉన్న భర్త ఉత్తమ్ సహకారం ఇప్పటికే రూ.15 వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. దీనిలో భాగంగానే వివిధ గ్రామాల లో రోడ్ల నిర్మాణానికి రూ. 279.5 కోట్లు, నీటి నీటిపారుదల సమస్యలు తీర్చేందుకు రూ.66.50 కోట్లు, పంచాయతీరాజ్ ద్వారా రూ.159 కోట్లు, డి ఎం ఎఫ్ టి రూ.42.71 కోట్లు, నూతన బస్టాండ్ ల నిర్మాణానికి రూ.16.89 కోట్లు, మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి పనులకు రూ.45.8 కోట్లు మంజూరీ చేయించారు. 

విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యత 

ఉన్నత విద్యావంతురాలైన పద్మావతికి విద్య వలన కలిగే ప్రయోజనాలపై పూర్తి అవగాహన ఉండడం ఫలితంగా ఆమె ఆ రంగానికి తగిన ప్రాధాన్యత ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి నిదర్శనమే రూ.50 కోట్ల వ్యయంతో జవహర్ నవోదయ పాఠశాల నిర్మాణ పనులు చేపట్టడం. ఈ పాఠశాల ప్రారంభం అయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు వసతి సౌకర్యాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

అలాగే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు కోసం రూ.350 కోట్లు మంజూరు చేయించారు. ఇక వైద్య రంగంలో కీలక నిర్ణయంగా కోదాడలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ ఆధునిక వైద్య పరికరాలు, అదనపు వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో కోదాడతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.

ఇవేకాకుండా నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అనుసంధానిస్తూ రహదారుల నిర్మాణం పూర్తి కావడంతో రవాణాకు కూడా ఇబ్బందులు తొలగిపోయాయి. మొత్తంగా పద్మావతి రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి మునుపెన్నడూ లేని విధంగా జరుగుతోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులోనూ కోదాడలో మరింత అభివృద్ధి జరగాలని కోరుతున్నారు.                 

సమగ్రాభివృద్ధికి నిరంతర కృషి

కోదాడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తా. ఇప్పటికే రూ.15 వందల కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేశాం. నియోజకవర్గ ప్రజలు మా సొంత పిల్లలుగా భావించి వారికి ఏ ఇబ్బందులు ఉండకూడదన్న సంకల్పంతో  ముందుకు సాగుతు న్నాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు తగిన న్యాయం జరుగుతుంది. ఇందు లో ఎటువంటి సందేహం లేదు. కోదాడ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పని చేస్తా.

 నలమాద పద్మావతిరెడ్డి, ఎమ్మెల్యే, కోదాడ

మునుపెన్నడూ జరగని అభివృద్ధిని చూస్తున్నాం

కోదాడ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ చూడని అభివృద్ధి చూస్తు న్నాం. గతంలో ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్లాలంటే రోడ్లు సౌకర్యం సక్రమంగా లేక ఇబ్బంది జరిగేది. కానీ నేడు అన్ని గ్రామాలకు రోడ్లు ఏర్పాటుతో ఒక సమస్య తొలగిపోయింది. అలాగే కోదాడ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడా వసతులు లేకపోవడంతో పాటు సిబ్బంది సిబ్బంది సక్రమంగా లేకపోవడంతో వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందేవి.

కానీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి చూపిన చొరవతో ఇప్పుడు అన్ని సమస్యలు తీరిపోయాయి. ఆమె చూపుతున్న చొరవతో భవిష్యత్తులో మరింత అభివృద్ధి జరుగుతుందనే విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.                           

 రాయపూడి వెంకటనారాయణ, కోదాడ