27-12-2025 02:02:50 AM
ఆదిలాబాద్, డిసెంబర్ 26 (విజయక్రాంతి):గ్రామ పాలన ప్రజలకు మరింత చేరువ కావాలంటే సర్పంచులే కీలక పాత్ర పోషించాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ సర్పంచులకు శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూత న సర్పంచులకు శాలువాలతో సన్మానించి, అభినందించారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మె ల్యే వెడమ బొజ్జు పటేల్, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య, మాజీ ఎంపీ సోయం బాపూరావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, డిసిసిబి మాజీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి, పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.