08-10-2025 12:39:09 AM
ముకరంపుర, అక్టోబరు 7 (విజయ క్రాంతి): రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందజేయాలని డిమాండ్ చేస్తూ రిటైర్డ్ ఎంప్లాయిస్ వె ల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జి ల్లా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సంద ర్భంగా అధ్యక్షులు కోహెడ చంద్రమౌళి మా ట్లాడుతూ 2024 మార్చి నుండి ఇప్పటివరకు ఉద్యోగ వరమన పొందిన ఉద్యోగ ఉ పాధ్యాయులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందలేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిటైర్మెంట్ బె నిఫిట్స్ అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సుంకిశేల ప్రభాకర్ రావు, కోశాధికారి కనపర్తి దివాకర్, తదితరులుపాల్గొన్నారు.