08-10-2025 12:38:25 AM
చేగుంట, అక్టోబర్ 7 :అప్పుల బాధతో వ్యక్తి మృతి చెందిన సంఘటన చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వట్టెం రమే ష్ (32) కుటుంబ పోషణ కోసం అప్పులు చేయడంతో తరచూ భార్యాభర్తలు గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో ఈనెల 4న తన ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగగా, విష యం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించా రు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు చేగుంట పోలీసులు తెలిపారు. మృతిని మామ ఏశం కిషన్ ఫిర్యాదు మే రకు కేసు నమోదు చేసినట్లు చేగుంట ఎస్‌ఐ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు.