12-10-2025 01:00:47 AM
మెదక్ జిల్లా లింగసానపల్లిలో ఘటన
మెదక్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళను డయల్ 100 కాపాడింది. అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఆమెకు మెదక్ జిల్లా పోలీసులు సీపీఆర్ చేసి, ఆమె ప్రాణాన్ని రక్షించారు. హవేళీ ఘణపూర్ మండలం లింగసానపల్లిగ్రామానికి చెందిన జ్యోతి తన ఇంట్లో శనివారం ఆత్మహత్యకు యత్నించింది. ఇది గమనించిన స్థానికు లు డయల్ 100కు కాల్ చేశారు. తక్షణమే కానిస్టేబుళ్లు వరప్రసాద్(లడ్డు), జయానంద్, రమేశ్ సంఘటనా స్థలానికి వెళ్లారు.
లోపలి నుంచి గడియపెట్టి ఉండడంతో గడ్డపారతో తలుపులను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అప్పటికే ఉరేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లిన జ్యోతికి వెంటనే సీపీఆర్ చేసి, ఆమెను మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు హవేళీ ఘణపూర్ ఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్లిబాధితురాలికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అత్యవసరమైన, వేగవంతమైన స్పం దన వల్లమహిళ ప్రాణాన్ని కాపాడినందుకు కానిస్టేబుళ్లను అభినందించారు. ఎవరైనా అత్యవసర సమయంలో డయల్ 100కు కాల్ చేయాలని, తక్షణ చర్యలు తీసుకుంటామని కోరారు.