12-10-2025 12:59:25 AM
ఆంధ్రా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుబడిన వ్యక్తులు
అశ్వారావుపేట అక్టోబర్ 11,(విజయ క్రాంతి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ఆంధ్రా, తెలంగాణ సరిహద్దు రహదారిలో కారులో తరలిస్తున్న రూ. 1.11 కోట్ల విలువ చేసే గంజాయిని అశ్వారావుపేట పోలీసులు పట్టుకున్నట్టు అశ్వారా వుపేట సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు తెలిపారు. శనివారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ వివరాలను వెల్లడించారు.
హైదరాబాద్‌కు చెందిన సరిన్ కుమార్, బెల్లంపల్లికి చెందిన బాబర్ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఆంధ్రాలోని విశాఖపట్టణానికి చెందిన పంగి శ్రీను వద్ద 222 కేజీల గంజాయిని కొనుగోలు చేసి స్విఫ్ట్ డిజైర్ కారులో మహారాష్ట్రకు తరలిస్తున్నారు. ఎస్‌ఐ రామూర్తి సిబ్బందితో శనివారం ఉదయం పేపర్ బోర్డు సమీపంలో వాహన తనిఖీలు చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం వైపు నుంచి సత్తుపల్లి వైపు వస్తున్న కారు నిలపకుండా వెళ్లిపోతుండడంతో పోలీసులు వెంబడించి పెట్టుకు న్నారని, కారులో ఉన్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని వారి వద్దనుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరుస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐలు యయాతి రాజు, రామూర్తి ఉన్నారు.